ETV Bharat / entertainment

స్టేజ్​పై 'మిర్చి' సాంగ్​కు కృష్ణంరాజు డ్యాన్స్​.. అదే చివరిసారిగా - కృష్ణంరాజు చివరి డ్యాన్స్ వీడియో

రెబల్​స్టార్​ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్​ అవుతోంది. ఇందులో ఆయన ప్రభాస్​ నటించిన ఓ సాంగ్​కు డ్యాన్స్​ వేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దాన్ని మీరు చూసేయండి..

krishnam raju last dance
కృష్ణంరాజు లాస్ట్ డ్యాన్స్​
author img

By

Published : Sep 14, 2022, 1:30 PM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్​లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం మొయినాబాద్​లోని కృష్ణంరాజు ఫామ్ హౌస్​లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హీరో ప్రభాస్ సోదరుడు చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.

అయితే 56 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కృష్ణంరాజు ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత పరాజయాల్ని ఎదుర్కొని, ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా ప్రయాణం సాగిస్తూ మళ్లీ హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఆయన సొంతం. అయితే ఆయన ఇకలేరన్న వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన్ను ఇంకా స్మరించుకుంటూ సోషల్​మీడియాలో ఆయనకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కృష్ణంరాజు డాన్స్ వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తూ వైరల్​గా మారింది. అయితే ఆయన చివరి డ్యాన్స్​ ఇదేనంటూ అందులో రాసి ఉంది. ప్రభాస్ మిర్చి సినిమా ఆడియో ఫంక్షన్​లో స్టేజ్​పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కృష్ణంరాజుతో స్టెప్పులేయించారు. కృష్ణంరాజు కూడా ఎంతో ఉత్సాహంగా చిందులేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియోనే వైరల్ అవుతోంది. దాన్ని మీరు చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కృష్ణంరాజు 'మా' ప్లాన్​.. ఆయన మంచు విష్ణుతో అలా చేయించారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.