ETV Bharat / entertainment

కరణ్​ జోహార్ సంచలన​ ప్రకటన.. గుండె బద్ధలైందని మంచు లక్ష్మి పోస్ట్​ - hotstar koffee with karan season

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కాఫీ విత్ కరణ్' టాక్​ షోపై ఆయన చేసిన ప్రకటన.. హిందీ బుల్లితెర ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Karan
కరణ్​ జోహార్
author img

By

Published : May 4, 2022, 3:14 PM IST

Updated : May 4, 2022, 10:51 PM IST

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ షాకింగ్ ప్రకటన చేశారు. 'కాఫీ విత్ కరణ్' టాక్​ షో దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్​ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి.. కరణ్ ట్విస్ట్ ఇచ్చారు. షోను ముగించినట్లు తెలుపుతూ.. సోషల్​ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్​ను పెట్టారు.

"కాఫీ విత్ కరణ్ అనేది నా జీవితంలోనే కాకుండా మీ అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. మీ అందరి మీద ఆ షో ఎంతో ప్రభావాన్ని చూపించిందని భావిస్తున్నా. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటనను విడుదల చేస్తున్నా. ఇకపై ఈ షోను చేయడం లేదు. మళ్లీ ఇకపై ఈ షో రాదు" అంటూ కరణ్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. కాగా, దీనిపై స్పందించిన ముంచు లక్ష్మీ.. 'గుండె బద్ధలైంది' అనే అర్థం వచ్చేలా ఎమోజీని ట్వీట్​ చేశారు.

కాసేపటికే కరణ్​ ట్విస్ట్​..

అయితే కొద్ది సేపటికే.. మరో ట్విస్ట్ ఇచ్చాడు కరణ్‌ జోహార్‌. `కాఫీ విత్‌ కరణ్‌` టాక్‌ షో ఇకపై టీవీలో ప్రసారం కాదని, కానీ ఓటీటీలో వస్తుందని చెప్పారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఇది స్ట్రీమింగ్‌క అవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడో సీజన్‌ నుంచి ఓటీటీలో ప్రసారం కాబోతుందని చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. కొత్త సీజన్​కు తొలి గెస్టులుగా కొత్తగా పెళ్లైన అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ రానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: సినీ అప్డేట్స్​: ఓటీటీలో 'బీస్ట్'​.. సూర్య గోవా ప్లాన్

Last Updated : May 4, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.