ETV Bharat / entertainment

దుమ్మురేపిన కిరణ్​ అబ్బవరం.. 'మీటర్'​ ట్రైలర్​ అదిరిపోయిందిగా! - మీటర్ మూవీ ట్రైలర్​

టాలీవుడ్​ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మీటర్'. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి హైప్​ క్రియేట్​ అవ్వగా.. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంచ్​ చేసింది.

kiran-abbavarams-meter-movie-trailer-released

author img

By

Published : Mar 29, 2023, 1:29 PM IST

ఇండస్ట్రీలో వస్తున్న రిజల్ట్స్​తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా తర్వాత ఆయన 'మీటర్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. రమేశ్​ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా కోలీవుడ్​ యంగ్‌ హీరోయిన్‌ అతుల్య రవి తెలుగు తెరకు పరిచయమౌతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​తో పాటు క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో కిరణ్‌ అబ్బవరం తొలిసారి పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్​ 7 ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి సారించిన చిత్ర బృందం ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్​ను బుధవారం విడుదల చేశారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీక్వెన్స్​తో రూపొందిన ఈ ట్రైలర్​ చూసేందుకు చాలా ఆసక్తిగా ఉందని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే కిరణ్‌ అబ్బవరం ఈ సారి లవ్‌, రొమాన్స్‌, యాక్షన్​, కామెడీ, లాంటి అన్నీ జానర్స్​తో సెన్సేషన్​ క్రియేట్​ చేయనున్నారని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచేసింది. ట్రైలర్​తో పాటు అందులోని పవర్​ ఫుల్​ డైలాగ్స్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. "భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి" అంటూ సాగే ఓ డైలాగ్ ట్రైలర్​కు హైలైట్‌గా నిలిచింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, చిరంజీవి, హేమలత పెదమల్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఈ చిత్రానికి సాయి కార్తిక్‌ సంగీతాన్ని అందించారు. మేకర్స్ ఇప్పటివరకు రెండు పాటలతో పాటు ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఇక బుధవారం రిలీజైన ట్రైలర్​తో సినిమాపై మరింత హైప్​ను పెంచేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నెలల వ్యవధిలో హీరో కిరణ్ అబ్బవరం నాలుగు సినిమాలను విడుదల చేశారు. గత ఏడాది 'సెబాస్టియన్', 'పీసీ 524', 'సమ్మతమే','నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రాలు చేశారు. అయితే వాటన్నింటిని పాజిటివ్​ టాక్​ వచ్చినప్పటికీ బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' కూడా మంచి టాక్​ సొంతం చేసుకుంది. ఈ సక్సెస్​తో మంచి జోష్​లో ఉన్న కిరణ్​ అబ్బవరం.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. ఇక హీరోయిన్ అతుల్య సైతం ట్రైలర్​లో కనువిందు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.