ETV Bharat / entertainment

కరణ్‌ జోహార్‌ కోసమే ఆ బోల్డ్ పాత్ర చేశానన్న కియారా - షాహిద్ కపూర్​

kiara advani koffee with karan నటిగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నానని చెప్పిన దానికంటే కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొంటున్నానని చెప్పినప్పుడే తన స్నేహితులు సంతోషించారని చెప్పారు నటి కియారా అడ్వాణీ. తాజాగా బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్​తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు.

kiara advani koffee with karan
kiara advani koffee with karan
author img

By

Published : Aug 25, 2022, 3:54 PM IST

kiara advani koffee with karan: నటి కాకముందు తన జీవితంలో చోటుచేసుకొన్న ఓ ఇబ్బందికర ఘటనపై పెదవి విప్పారు నటి కియారా అడ్వాణీ. ఓ ఇండస్ట్రీ ఫంక్షన్‌లో పాల్గొని దర్శకుడ్ని కౌగిలించుకున్నానని ఆ క్షణం అక్కడున్న వారందరూ షాకయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. 'కబీర్‌ సింగ్‌' సహనటుడు షాహిద్ కపూర్‌తో కలిసి 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో పాల్గొన్న కియారా తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..

'కాఫీ విత్‌ కరణ్‌' షోలో పాల్గొన్న కియారా, షాహిద్ కపూర్‌

''కాఫీ విత్‌ కరణ్‌' షో చూస్తూ పెరిగిన నేను ఇప్పుడిదే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నటిగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నానని చెప్పిన దానికంటే 'కాఫీ విత్‌ కరణ్‌'లో పాల్గొంటున్నానని చెప్పినప్పుడే నా స్నేహితులు సంతోషించారు. కరణ్‌ జోహార్‌.. తన సినిమాల్లో ఆఫర్‌ అయితే ఇచ్చారు. కానీ, ఇప్పుడే 'కాఫీ విత్‌ కరణ్‌' షోకి నన్ను ఆహ్వానించారు'' అంటూ తన ఆనందాన్ని బయటపెట్టారు నటి కియారా.

నటి కియారా అడ్వాణీ

''చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. నటిగా మారాలనుకున్నా. ఇదే విషయం నా కుటుంబానికి ఆప్తురాలైన ప్రముఖ నటి జుహీ చావ్లాకు తెలిసింది. ఆమె నటించిన 'ఐ యామ్‌' విడుదలై, మంచి టాక్‌ సొంతం చేసుకొన్నప్పుడు ఇండస్ట్రీ మిత్రుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేసింది. పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాతలకు నన్ను పరిచయం చేయడం కోసం ఆ పార్టీకి నన్నూ ఆహ్వానించింది. ఆమె మాట ప్రకారం నేను అక్కడికి వెళ్లగా.. దర్శకుడు సుజాయ్‌ ఘోష్‌ని ఆమె నాకు పరిచయం చేసింది. ఇష్టాయిష్టాలు, ఇతర అంశాలపై మాట్లాడుతున్న సమయంలో సుజాయ్‌ ఒక్కసారిగా తన చేయి పైకెత్తి ఎవరినో పిలవబోయారు. దాన్ని అర్థం చేసుకోలేకపోయిన నేను.. కౌగిలించుకోమంటున్నారేమో అనుకొని వెంటనే ఆయన్ని హగ్‌ చేసుకున్నా. నేను చేసిన పనితో అక్కడే ఉన్న జుహీ షాకయ్యారు. 'ఈ పిల్లేంటి ఇలా చేస్తోంది' అన్నట్లు నా ముఖం వైపు చూశారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఇబ్బందికర ఘటన''

నటి కియారా అడ్వాణీ

''కరణ్‌ జోహార్‌ కోసమే నేను 'లస్ట్‌ స్టోరీస్‌'లో నటించా. అది నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సిరీస్‌ షూట్‌ పూర్తైన తర్వాత నటీనటులందరికీ ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి సిద్దార్థ్‌ మల్హోత్ర వచ్చాడు. అప్పుడే మొదటిసారి మేమిద్దరం కలుసుకొన్నాం. అలా, పరిచయమైన మేమిద్దరం కలిసి 'షేర్షా'లో నటించడం ఆనందాన్ని ఇచ్చింది. సిద్ధార్థ్‌ నాకు మంచి స్నేహితుడు. నాకు ఇష్టం లేని ఏ వస్తువును తను బహుమతిగా ఇవ్వడు'' అని కియారా చెప్పగానే ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు? అని కరణ్‌ ప్రశ్నించాడు. దానిపై కియారా స్పందిస్తూ.. ''పెళ్లి చేసుకోవాలని ఉంది. తప్పకుండా చేసుకుంటా. పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తా'' అని ఆమె చెప్పుకొచ్చారు. దానిపై మరోసారి కరణ్‌ స్పందిస్తూ.. ''మాకు తెలుసు నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకోనున్నావో. మేము అనుకొన్న వ్యక్తితోనే నీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాం'' అని సిద్దార్థ్‌ - కియారా పెళ్లిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.

సిద్దార్థ్‌ - కియారా జంట

ఇక 'కబీర్‌ సింగ్‌'పై కియారా స్పందిస్తూ.. ''కబీర్‌ సింగ్‌'లో నేను పోషించిన ప్రీతి పాత్రకు అంతటా మంచి స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రకు కనెక్ట్‌ అయిపోయారు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా ప్రీతి అనే పిలుస్తుంటారు. ఈ సినిమా షూట్‌ సమయంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు చోటుచేసుకొన్నాయి. కానీ, ఓ సంఘటన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. షూటింగ్‌ మొదలైన నాలుగోరోజు ఓ సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు.. ఆ సీన్‌కి హీరో చెప్పులు వేసుకోవాలా? లేదా బూట్లు వేసుకోవాలా? అని దర్శకుడు సందీప్‌ - హీరో షాహిద్‌కు మధ్య చర్చ నడిచింది. అలా సుమారు ఎనిమిది గంటలపాటు నన్ను సెట్‌లోనే వెయిట్ చేయించారు. ఆ క్షణం షాహిద్‌ని కొట్టాలనిపించింది'' అని కియారా చెప్పుకొచ్చారు.

కియారాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన 'లస్ట్‌ స్టోరీస్‌'ని మొదట కృతి సనన్‌తో చేయాలనుకున్నానని కరణ్‌ ఈ కార్యక్రమంలో తెలిపారు. ఆ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉండటంతో కథ విన్నా వెంటనే.. 'ఇలాంటి పాత్రలు చేస్తే అమ్మ ఒప్పుకోదు' అని ఆమె సున్నితంగా ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేయడంతో.. కియారాని ఎంచుకున్నానని చెప్పారు.

ఇవీ చదవండి: మతి పోగొడుతున్న నాగిని బ్యూటీ, హాట్​ లుక్స్​కు కుర్రకారు ఫిదా

విజయ్​ లైగర్​ మూవీ రిలీజ్​, నాగార్జున యాక్షన్‌ సీన్స్​కు ఫ్యాన్స్​ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.