Kiara Advani Dance : తన క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా మారింది బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో మరోసారి టాలీవుడ్లో సందడి చేయనుంది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ తార అక్కడ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రముఖ టీవీ షో 'కాఫీ విత్ కరణ్ లో నటుడు విక్కీ కౌశల్‌తో మెరిసింది. డిసెంబరు 7న స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో కరణ్‌తో కలిసి కియారా, విక్కీ ఎంత సందడి చేశారో అందులో చూడొచ్చు.
హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానాలు చెప్పింది. అయితే ప్రోగ్రాంలో భాగంగా కరణ్ అతిథులిద్దరినీ డ్యాన్స్ చేయమని అడిగారు. దీంతో కియారా కాస్త ఇబ్బంది పడింది. అయితే కొన్ని స్టెప్పులు వేసింది. 'ఈ డ్రెస్సులో ఇంతకంటే ఎక్కువగా డ్యాన్స్ చేయలేను' అంటూ చిరు నవ్వుతో సమధానం చెప్పింది. అయితే సినిమా కోసం ముందుగా ప్రిపేర్ అవుతారు కాబట్టి స్టార్స్ సెట్స్‌లో బాగా డ్యాన్స్ చేయగలుగుతారు. కానీ అతిథిగా హాజరైన కార్యక్రమంలో అప్పటికప్పుడు స్టెప్పులు వేయాల్సిన పరిస్థితి వస్తే కాస్త ఇబ్బందిగానే ఫీలవుతారు. అందుకు వారు ధరించిన దుస్తులు కూడా ఓ కారణమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Kiara Advani Movies List : ఇక కియారా సినిమాల విషయానికొస్తే.. కియారా, విక్కీ కలిసి 'లస్ట్ స్టోరీస్', 'గోవిందా నామ్ మేరా' సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. షేర్షా సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా సిద్ కియారాలు ఆన్ స్క్రీన్ పెయిర్‌గా పాపులరయ్యారు. అయితే వీరిద్దరూ గతేడాది ఆఫ్‌స్క్రీన్ కపుల్‌గా ప్రమోషన్ పొందారు. వివాహబంధంతో ఒకటయ్యారు.
-
The Beauty and the Bahadur are all set to spill some fresh Koffee beans on the couch this week. #HotstarSpecials #KoffeeWithKaran Season 8 Episode 7 streaming from 7th Dec. #KWKS8OnHotstar pic.twitter.com/iSlez1vVbp
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Beauty and the Bahadur are all set to spill some fresh Koffee beans on the couch this week. #HotstarSpecials #KoffeeWithKaran Season 8 Episode 7 streaming from 7th Dec. #KWKS8OnHotstar pic.twitter.com/iSlez1vVbp
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 4, 2023The Beauty and the Bahadur are all set to spill some fresh Koffee beans on the couch this week. #HotstarSpecials #KoffeeWithKaran Season 8 Episode 7 streaming from 7th Dec. #KWKS8OnHotstar pic.twitter.com/iSlez1vVbp
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 4, 2023
కొత్త లగ్జరీ కారు కొన్న కియారా.. వామ్మో అన్ని కోట్లా?
Kiara Advani Latest Interview : 'ఆ రెండు పాత్రల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాను.. కానీ అదే నాకు..'