ETV Bharat / entertainment

మాల్దీవుల్లో రాఖీభాయ్​.. అర్ధరాత్రి చార్మినార్​కు​ రాజమౌళి - యశ్​ కేజీఎఫ్ 2 కలెక్షన్స్​

KGF 2 Yash Maldives: 'కేజీఎఫ్ 2' విజయోత్సాహంలో కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారగా.. దీన్ని చూసిన అభిమానులు లైక్స్​, కామెంట్స్​తో సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి.. హైదరాబాద్​లోని చార్మినార్​ను సాధరణ వ్యక్తిలా సందర్శించారు.

KGF 2 Yash spending with family in  Maldives
మాల్దీవుల్లో రాఖీభాయ్
author img

By

Published : Apr 19, 2022, 11:58 AM IST

Updated : Apr 19, 2022, 12:19 PM IST

KGF 2 Yash Maldives: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మార్మోగుతున్న పేర్లలో రాకింగ్స్​ స్టార్​ యష్‌ ఒకటి. ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇండస్ట్రీని 'కేజీఎఫ్‌'తో ఒక్కసారిగా ప్రపంచ సినిమాకు పరిచయం చేశాడు. డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌, హీరో యష్‌ కాంబినేషన్‌లో ఇటీవలే వచ్చిన 'కేజీఎఫ్‌ 2' సైతం బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఐదురోజుల్లోనే రూ.500కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఈ నేపథ్యంలోనే.. దాదాపు నాలుగేళ్ల పాటు రెండో భాగం షూటింగ్​ కోసం పరిమితమైన యశ్.. ​ విజయోత్సాహంలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్​ చేస్తున్నారు. భార్య రాధికా పండిట్‌, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను రాధికా సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇది చూసిన అభిమానులు.. "రూ.100కోట్లు సాధించగానే సక్సెస్​ పార్టీ అంటూ మిగతా చిత్రాలు హడావుడి చేస్తే.. హీరో యశ్​ మాత్రం కుటుంబంతో కలిసి సరదాగా గడపడం ఆనందంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు.

KGF 2 Yash spending with family in  Maldives
మాల్దీవుల్లో రాఖీ భాయ్​ ఫ్యామిలీ సందడి

Rajamouli in Charminar: 'ఆర్​ఆర్ఆర్'​తో సక్సెస్​ అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి హైదారాబాద్​ చార్మినార్​లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్ధరాత్రి చారిత్రక కట్టడాన్ని సందర్శించారు. సాధారణ వ్యక్తిలా వెళ్లి అక్కడి బజార్​ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్​లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి జక్కన్నతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. పాన్​ ఇండియా స్టార్​ డైరెక్టర్​ అయి కూడా ఇంత సింపుల్​గా ఉండటం జక్కన్నకే సాధ్యమని నెటిజన్లు అంటున్నారు.

rajamouli charminar
అర్ధరాత్రి చార్మినార్​కు​ రాజమౌళి

ఇదీ చూడండి: సాంగ్​ షూటింగ్​లో పవన్​, మహేశ్​ బిజీ బిజీ!

Last Updated : Apr 19, 2022, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.