ETV Bharat / entertainment

Katrina Kaif Tiger 3 : 'ఆ పాటలో నేను 7 లుక్స్​లో కనిపిస్తాను.. దాని కోసం..' - టైగర్ 3 మువీ రిలీజ్​ డేట్

Katrina Kaif Tiger 3 : బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్ ఖాన్​, బ్యూటీ కత్రినా కైఫ్​ లీడ్​ రోల్స్​లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'టైగర్​ 3'. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్​ను రిలీజ్​ చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన టీజర్​ విడుదలైంది. అందులో హీరోయిన్​ కత్రీనా వివిధ స్టైల్స్​లో కనిపించి ఆకట్టుకుంది. దాన్ని మీరూ చూసేయండి మరి..​

Katrina  Kaif Tiger 3
Katrina Kaif Tiger 3
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 4:37 PM IST

Updated : Oct 21, 2023, 5:46 PM IST

Katrina Kaif Tiger 3 : బాలీవుడ్ కండల వీరుడు​ సల్మాన్ ఖాన్​, బ్యూటీ కత్రినా కైఫ్​ లీడ్​ రోల్స్​లో రూపొందుతున్న తాజా మూవీ 'టైగర్​ 3'. యశ్​ రాజ్ ఫిల్మ్స్​ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓ సాంగ్​తో మ్యూజిక్​ లవర్స్​ను అలరించేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదలచేయనున్నట్లు తాజాగా మూవీ టీమ్​ ప్రకటించింది. ఈ సందర్భంగా పాట గురించి ఓ ఆసక్తికర విషయాన్ని హీరోయిన్​ కత్రినా కైఫ్‌ పంచుకున్నారు. ఈ పాట తనకెంతో ఇష్టమైనదని చెప్పిన కత్రినా.. దీన్ని టర్కీలో షూట్​ చేసినట్లు తెలిపారు. ఇక ఈ సాంగ్​లో ఆమె వివిధ స్టైల్స్​లో కనిపించనున్నట్లు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఇందులో నేను ఏడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాను. ప్రతి లుక్‌ గ్లామర్‌గా ఉండడమే కాదు.. దేనికదే స్పెషల్​గా ఉంటుంది. ఇక ఈ సినిమాకు పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. సల్మాన్‌, నా నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్లకు 'లేకే ప్రభు కా నామ్‌' అనే ఈ పాటలో కచ్చితంగా దొరుకుతుంది. ఇక సల్మాన్‌ ఖాన్‌తో డ్యాన్స్‌ చేయడం ఎప్పుడూ నాకు అద్భుతంగా ఉంటుంది. అది నాకెంతో ఇష్టం. ఈ పాట నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది" అని కత్రినా చెప్పారు.

Tiger 3 Movie Cast : ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్​ రాజ్​ బ్యానర్​పై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టైగర్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలకు సీక్వెల్​గా 'టైగర్​ 3' తెరకెక్కడం వల్ల ఫ్యాన్స్​లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్​, సెకెండ్​ పార్ట్​ల్లో లాగా ఈ సినిమాలోనూ సల్మాన్​, కత్రినా టైగర్​, జోయా అనే పాత్రల్లో కనిపించనున్నారు.

మరోవైపు ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ,అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ హీరోయిన్​ రేవతి కూడా చాలా కాలం తర్వాత సల్మాన్‌ ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్​ చేసుకోనున్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అంతే కాకుండా ఇందులో షారుక్ ఖాన్​ కూడా ఓ కేమియో రోల్​లో కనిపించనున్నారని టాక్​ నడుస్తోంది.

NTR Cameo role : 'సలార్'​ - 'టైగర్​ 3'లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?

Tiger 3 Trailer : కత్రినా కైఫ్​ బాత్​ టవల్​ ఫైట్ సెన్సేషన్​​.. రూ.1000 కోట్లు!

Last Updated : Oct 21, 2023, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.