ETV Bharat / entertainment

ఆ పనిలో విజయ్​సేతుపతి- కత్రిన ఫుల్​ బిజీ.. ఫొటోస్​ వైరల్​! - విజయ్ సేతుపతి

Vijay sethupati-katrina kaif: సోషల్​మీడియాలో విజయ్​సేతుపతి-కత్రినా కైఫ్​కు సంబంధించిన ఫొటోలు తెగ ట్రెండ్​ అవుతున్నాయి. ఎందుకంటే?

Vijay sethupati-katrina kaif
విజయ్​సేతుపతి- కత్రిన
author img

By

Published : Jul 25, 2022, 7:53 PM IST

Vijay sethupati-katrina kaif: దక్షిణాది నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా కత్రీనా కైఫ్‌ నాయికగా 'మెర్రీ క్రిస్మస్‌' సినిమా చేస్తున్నారు. 'అంధాదున్‌' దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్​ను కత్రిన సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది. 'వర్క్​ ఇన్​ ప్రొగ్రెస్'​ అని క్యాప్షన్​ జోడించింది. సీన్​కు సంబంధించిన చర్చలు జరపడం సహా రిహార్సల్స్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోస్​లో కత్రిన, విజయ్ సేతుపతి, శ్రీరామ్ రాఘవన్‌ ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని రమేష్‌ తరుణి, సంజయ్‌ రౌట్రే నిర్మిస్తున్నారు.

కాగా, కొంతకాలం క్రితం విక్కీకౌశల్​ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే మాల్దీవుల పర్యటనకు వెళ్లి వచ్చింది. భర్తతో కలిసి అక్కడ ఫుల్​ ఎంజాయ్​ చేసింది. దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పడికప్పుడు అభిమానులతో పంచుకుంది. ఆ పర్యటన ముగించుకుని ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఈ భామ సినిమా షూటింగ్​లపై దృష్టి సారించింది. అందులో భాగంగానే విజయ్​సేతుపతితో కలిసి చేస్తున్న మూవీ చిత్రీకరణలో పాల్గొంది. మరోవైపు విజయ్​ సేతుపతి కూడా ఇటీవలే 'విక్రమ్'​లో విలన్​గా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: Nude photoshoot: చిక్కుల్లో రణ్​వీర్​.. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.