ETV Bharat / entertainment

ఆ దర్శకుడు చేసిన పనికి కత్రిన చాలా భయపడిపోయిందట.. - కత్రినా కైఫ్ అనురాగ్ బసు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఏంటంటే..

Katrina kaif fear incident
అతడు చేసిన ఆ పనికి కత్రిన చాలా భయపడిపోయిందట
author img

By

Published : Oct 22, 2022, 8:58 PM IST

ఓవైపు మైమరపించే ముగ్ధమనోహర రూపం. మరోవైపు విమర్శకులను కూడా మెప్పించే నటనా కౌశలం. అన్నింటికీ మించి అద్భుతమైన డ్యాన్స్‌ ప్రతిభ. ఆమెనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఈమె కెరీర్‌ ఆరంభంలోనే ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.

2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామను.. కెరీర్​ ఆరంభంలో ఒక టేక్ తర్వాత మూవీ నుంచి సడన్‌గా తీసేశారట. తన కొత్త మూవీ 'ఫోన్ బూత్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని చెప్పింది. "ఆ సినిమా పేరు 'సాయ'. ఆ మూవీలో జాన్ అబ్రహాం హీరోగా నటించగా.. తరా శర్మ అతనికి జోడీగా చేసింది. ఆ సినిమా షూటింగ్​లో నా మీద చిత్రీకరించిన తొలి షాట్​ తర్వాత.. డైరెక్టర్ కోపంతో ప్రొడ్యూసర్ వైపు చూసి వెంటనే ఈ సినిమా నుంచి కత్రినను తీసేయ్ అని ఆదేశించారు. దాంతో నా కెరీర్ ఇక ముగిసిపోయిందని చాలా భయపడిపోయాను. కానీ ఆ తర్వాత దేవుడి దయవల్ల స్టార్​గా ఎదిగాను" అని పేర్కొంది. కాగా, కత్రిన చెప్పిన మాటల్ని బట్టి చూస్తే సాయ సినిమాకు అనురాగ్ బసు దర్శకుడిగా వ్యవహరించారు. కాబట్టి అనురాగ్​నే ఆమెపై కోప్పడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్ ఆ సినిమా నుంచి కత్రినను తప్పించారట.

ఇకపోతే కత్రిన.. ఈ సినిమా చేజారిన ఇండస్ట్రీలో సుమారు రెండు దశాబ్దాలుగా రాణిస్తోంది. స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ఇటీవలే మరో హీరో విక్కీ కౌశల్​ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఫోన్ బూత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబరు 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇదీ చూడండి: ఆ ఒక్క సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.