ETV Bharat / entertainment

కార్తికేయ 3 ఫిక్స్​, తెలియని కథలతో మరిన్ని చిత్రాలు చేస్తామన్న నిఖిల్​ - karthikeya 2 movie sequels

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది కార్తికేయ 2. అయితే ఈ సినిమాకు మరిన్ని సీక్వెల్స్​ వస్తాయని హీరో నిఖిల్​ తెలిపారు. మరోవైపు అమెరికా బాక్సాఫీస్‌ వద్ద 1 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

karthikeya-2-more-exciting-instalments-are-on-their-way-said-by-nikhil

author img

By

Published : Aug 22, 2022, 9:53 PM IST

Karthikeya 2 Movie Sequels: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌ 'కార్తికేయ2'. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో 'కార్తికేయ' సిరీస్‌లో మరిన్ని సీక్వెల్స్‌ వస్తాయని కథానాయకుడు నిఖిల్‌ అన్నారు. ఓ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. 'కార్తికేయ' సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని ప్రశ్నించగా, 'కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్‌ కార్తీక్‌ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మన దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తాం' అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

"ప్రస్తుతం మా సినిమాకు వస్తున్న ఆదరణను అస్సలు ఊహించలేదు. మా టీమ్‌ మొత్తం ఆశ్చర్యపోతోంది. ఇప్పటికే అనేక చోట్ల షోలు పెరిగాయి. థియేటర్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్నీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నాయి. థియేటర్‌లో మా సినిమా చూసి, మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే హిందీలో తొలిరోజు కేవలం 50 స్క్రీన్‌లలోనే విడుదల చేశాం. ఇప్పుడు ఆ సంఖ్య 1000కు పెరిగింది. రోజుకు 3000 ప్రదర్శనలు అవుతున్నాయి. ఈ వారంలో అది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నా. భారతీయ ప్రజలకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వారసత్వ సంపదను బాధ్యతతో ముందుకు తీసుకొచ్చాం. కృష్ణతత్వంపై మా స్థాయిలో పరిశోధన చేసి, ఈ సినిమాను తీర్చిదిద్దాం" అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

యూఎస్‌లో 'కార్తికేయ2' రికార్డు
భారతదేశంలోనే కాదు, అమెరికాలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద 1మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు కథానాయకుడు నిఖిల్‌ స్వయంగా వెల్లడించారు. అమెరికాలోని సినిమా ప్రేమికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.75కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. రూ.100కోట్ల వైపు పరుగులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు.

ఇవీ చదవండి: అందంతో ఆకట్టుకుంటున్న మేఘన, ఆ స్మైల్​కు ఎవరైనా ఫిదా కావాల్సిందే

స్టార్ దర్శకుడికి షాక్​, ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.