ETV Bharat / entertainment

'పొన్నియన్​ సెల్వన్​'​@రూ.300 కోట్లు.. ఆ ఇద్దరు హీరోలకు కార్తీ 'స్పెషల్'​ థ్యాంక్స్​!

author img

By

Published : Oct 7, 2022, 3:06 PM IST

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్​ సెల్వన్​.. సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్​ వసూలు చేసిందని మేకర్స్​ తెలిపారు. మరోవైపు, స్టార్​ హీరోలు కమల్​ హాసన్​, రజనీకాంత్​ను ఉద్దేశిస్తూ నటుడు కార్తీ ట్వీట్​ చేశారు.

karthi-thanks-rajinikanth-and-kamal-haasan-for-their-appreciation-and-inspiration
karthi-thanks-rajinikanth-and-kamal-haasan-for-their-appreciation-and-inspirationkarthi-thanks-rajinikanth-and-kamal-haasan-for-their-appreciation-and-inspiration

భారీ అంచనాల మధ్య విడుదలైన 'పొన్నియిన్‌ సెల్వన్‌' సినిమా ప్రేక్షకాదరణ పొందుతూ సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా గ్రాస్​ వసూలు చేసిందని మేకర్స్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ సినిమా చూసిన ప్రముఖులు సైతం సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఓ ప్రైవేటు స్క్రీన్‌లో 'పొన్నియిన్‌ సెల్వన్‌' చూసిన రజనీకాంత్‌.. మణిరత్నంతో పాటు నటీనటులందరినీ వ్యక్తిగతంగా పిలిచి మెచ్చుకొన్నారు. మరోవైపు కమల్‌హాసన్‌ 'పొన్నియిన్‌ సెల్వన్‌' హీరోలు కార్తీ, విక్రమ్‌తో కలిసి ఆ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా టీం అందరినీ అభినందించారు.

karthi-thanks-rajinikanth-and-kamal-haasan-for-their-appreciation-and-inspiration
కార్తీ ట్వీట్​

రజనీ, కమల్‌ను ఉద్దేశిస్తూ కార్తీ ట్వీట్‌ చేశారు. "రజనీకాంత్‌ సర్‌ మీ నుంచి వచ్చిన కాల్‌ చాలా ప్రత్యేకమైనది. ఇతరుల పనిని మెచ్చుకొని వారిని ప్రొత్సహించడంలో మీరెప్పుడూ ముందుంటారు. ధన్యవాదాలు". "కమల్‌ సర్‌ నేను ఉన్నత లక్ష్యాలను చేరడానికి నాకు మీరెప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు. దానికి మించి ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను"అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి: మాల్దీవులు టూర్​కు విజయ్​-రష్మిక!.. ప్రేమలో మునిగితేలుతున్నారా?

'గాడ్​ఫాదర్​' డైరెక్టర్​తో నాగార్జున-అఖిల్​ మూవీ!.. స్క్రిప్ట్​ వర్క్​ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.