ఐదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు బాలీవుడ్ జంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’తో ప్రేమికులుగా మారిన ఈ జంట.. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఒక్కటైంది. అయితే పెళ్లికి వచ్చిన వారిలో అందరికంటే ఎక్కువగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌జోహార్ సందడి చేశారట. సంగీత్‌లో ఆలియాతో 'రాధా' పాటకు డాన్స్ చేసి.. అందరిలో హుషారు నింపారు.
ఆలియా-కరణ్‌జోహర్ మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆలియాను 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్గా పరిచయం చేసింది ఆయనే. అప్పటి నుంచి ఆలియాను కరణ్ ఒక కేర్ టేకర్‌గా చూసుకుంటున్నారు. ఆలియాకు ఏ సమస్య వచ్చినా.. కరణ్‌కు చెప్పుకునేంత చనువు వారి మధ్య ఉందని బాలీవుడ్లో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆలియా- రణ్‌బీర్ పెళ్లి సందర్భంగా వీరి అనుబంధం మరోసారి బయట పడింది.
పెళ్లి తర్వాత కరణ్‌జోహార్ మరింత ఏమోషనల్ అయ్యారు. ఆలియాపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆలియాను పెళ్లి చేసుకున్న రణ్‌బీర్‌ను 'అల్లుడు' అంటూ సంబోధించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: 'రాఖీభాయ్'కు బాక్సాఫీస్ సలాం- హిందీలో ఆమిర్‌ఖాన్ రికార్డ్ బద్దలు