ETV Bharat / entertainment

'కాంతార' అభిమానుల​కు గుడ్​ న్యూస్​.. సినిమా మొదలయ్యేది అప్పుడే! - కాంతార మూవీ ప్రీక్వెల్​

Kantara 2 Prequel Update : సాధారణ చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 'కాంతార'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్​ 'కాంతార-2'కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. తాజాగా చిత్రానికి సంబంధించిన అప్డేట్​ వచ్చింది. అదేంటంటే..

Kantara Movie Prequel Final Draft Is Ready
కాంతార ప్రీక్వెల్​ మొదటి డ్రాఫ్ట్​ ఖరారు.. సెట్స్​పైకి వెళ్లేందుకు రెడీ!
author img

By

Published : May 8, 2023, 6:18 PM IST

Kantara 2 Prequel Update : 'కాంతార'.. సౌత్​ ఇండస్ట్రీ రేంజ్​ను మరోసారి పాన్​ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా. రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా. కథతో పాటు సినిమాలోని ప్రతి పాత్రను అధ్బుతంగా తీర్చిదిద్దారు. ఈ అంశాలే సినిమాకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. దీంతో బాక్సాఫిస్​ వద్ద బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. కన్నడ సహా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, తులు భాషల్లో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈ ఉత్సాహంతోనే సినిమా వంద రోజుల ఫంక్షన్​లో ఈ చిత్రానికి సీక్వెల్​ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్​ అనౌన్స్​ చేశారు.

Kantara 2 Prequel Update : తాజాగా కాంతార​​-2 గురించి ఓ అప్డేట్​ వచ్చింది. ప్రీక్వెల్​ కోసం సన్నాహాలు మొదలు పెట్టిన మేకర్స్.. సినిమా స్క్రిప్ట్​కు సంబంధించిన ఫైనల్​ డ్రాఫ్ట్​ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు సరదాగా ప్రీక్వెల్​ స్టోరీని గెస్​ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్​ చేసిన ఈ మొదటి డ్రాఫ్ట్​పై​ రిషభ్‌తో పాటు సినిమా టీమ్ సంతృప్తిగా ఉందని.. ఇంకాస్త సమయం తీసుకొని స్క్రిప్ట్‌ని రివ్యూ చేయనున్నారని సమాచారం. రివ్యూ సమయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది చూసి చివరగా ప్రీక్వెల్​ కథ కాపీను సెట్స్​పై తీసుకెళ్తారట.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​ కోసం లొకేషన్​ స్పాట్లను వెతికే పనుల్లో నిమగ్నమయిందట చిత్ర బృందం. ఇందుకోసం కోస్టల్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిసింది. అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. కాంతార పార్ట్​-2 షూటింగ్​ వర్షాకాలం ప్రారంభంలో షురూ కానుంది. కాంతార పార్ట్​-1 బ్లాక్​బస్టర్​ హిట్ కావడం వల్ల రెండో భాగంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో ప్రధానంగా 'భూతకోల' ఆచారాన్ని చూపించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు. గతేడాది సెప్టెంబర్​లో రిలీజ అయిన ఈ కన్నడ సినిమా.. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. విడుదల తర్వాత దాదాపు రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టగలిగింది. అంజనీశ్​ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇందులోని 'వరహా రూపం' సాంగ్​ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఐరాసలో 'కాంతార'..
ఇటీవలే కాంతారకు ఓ అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్​ జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించారు. ఇందుకోసం స్విట్జర్లాండ్​కు చేరుకున్న రిషబ్​ శెట్టి.. సినిమా స్క్రీనింగ్‌ పూర్తైన అనంతరం వేదికపై ప్రసంగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.