ETV Bharat / entertainment

కన్నడ నుంచి మరో పవర్​ప్యాక్డ్​ మూవీ.. స్టన్నింగ్​ యాక్షన్​ విజువల్స్​తో టీజర్​!

ఎ. పి. అర్జున్‌ దర్శకత్వంలో కన్నడ యాక్షన్ ప్రిన్స్​ ధ్రువ సార్జా హీరోగా నటిస్తున్న చిత్రం 'మార్టిన్‌'. తాజాగా ఈ టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. హీరో ఎలివేషన్‌, విజువల్స్‌, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​తో 'కేజీయఫ్‌'ను తలపించేలా ఉన్న ఈ టీజర్​ను మీరూ ఓ సారి చూసేయండి..

martin teaser
మార్టిన్ టీజర్​
author img

By

Published : Feb 23, 2023, 7:18 PM IST

Updated : Feb 23, 2023, 7:34 PM IST

'కేజీయఫ్' తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే తెరకెక్కుతున్నాయి. అయితే రీసెంట్​గా 'పొగరు' సినిమాతో తెలుగు ఆడియెన్స్​ను అలరించిన ధృవ సార్జా.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'మార్టిన్' అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్​తో చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా మేకర్స్​ ఈ చిత్ర టీజర్​ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రంలో ఎంట్రీతోనే గూస్‌ బంప్స్ తెప్పించారు ధ్రువ సార్జా.

ఇకపోతే ఈ ప్రచార చిత్రాన్ని కూడా 'కేజీయఫ్' టీజర్​ తరహాలోనే అన్ని భాషల వారికి అర్థమయ్యేలా విడుదల చేశారు. కథలో ఎక్కువ భాగం పాకిస్థాన్​లోని ఒక జైల్లో సాగుతున్నట్లు చూపించారు. ఆ జైల్లో అనేక మంది పాకిస్థానీ ఖైదీల మధ్య ఉండే భారతీయ ఖైదీగా ధృవ సార్జా కనిపించారు. 'మీరంతా బలవంతులం అని అనుకుంటున్నారు. కానీ నేను బలవంతుడినని నాకు తెలుసు' అంటూ హీరో చెప్పే భారీ డైలాగ్ అదిరిపోయింది. ఇంకా ఈ టీజర్​లో స్పోర్ట్స్ కార్స్​, బైక్స్​ ఛేజింగ్‌లు, కళ్లు చెదిరేలా యాక్షన్ సీన్లు మైండ్​ బ్లోయింగ్​లా ఉన్నాయి. చూస్తుంటే గూస్​ బంప్స్​ను తెప్పిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాకు యాక్షన్ కింగ్ అర్జున్ కథను అందించిడం విశేషం. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్ డైరెక్ట్​ చేస్తున్నారు. వైష్ణవి శాండిల్య హీరోయిన్‌గా నటించారు. మాళవిక అవినాష్, నికితిన్ ధీర్, సాధు కోకిల, శ్రీరామ్ రెడ్డి పోలసాని , చిక్కన్న, అచ్యుత్ కుమార్, రోహిత్ పాఠక్, గిరిజ లోకేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఉదయ్ కె. మెహతా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మణి శర్మ పాటలను స్వరపరచగా, రవి బస్రూర్ బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ అందించారు. అమీ అర్నాల్డ్​ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. డాక్టర్ రవివర్మ, రామ్ లక్ష్మణ్, గణేష్ మాస్ మడ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు.

ధ్రువ సార్జా ఈ చిత్రంతో మరో సినిమా కూడా చేస్తున్నారు. దీని పేరు 'కేడీ - ది డెవిల్'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం, మహాభారత యుద్ధం రాజ్యం కోసం, ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే భారీ డైలాగ్ బాగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: కియారా గోల్డెన్​ లెహంగా.. 98వేల కాస్ట్లీ క్రిస్టల్స్​.. 4 వేల గంటల పాటు శ్రమించి

Last Updated : Feb 23, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.