ETV Bharat / entertainment

'బాలయ్య ఈగో లేని మనిషి.. ఆయనతో నటించడం అదృష్టం'.. విలన్​గా ఎంట్రీ ఇస్తున్న దునియా విజయ్​ - వీరసింహారెడ్డి మూవీలో విలన్​గా దునియా విజయ్

బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్​ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్యబాబుతో స్క్రీన్ షేర్​ చేసుకోవడం పై ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో ముచ్చటించారు. అవేంటో తెలుసుకుందాం రండి..

Kannada actor Duniya Vijay
కన్నడ యాక్టర్ దునియా విజయ్
author img

By

Published : Jan 5, 2023, 7:05 PM IST

'బాలయ్య ఈగో లేని మనిషి.. ఆయనతో నటించడం అదృష్టం'.. విలన్​గా ఎంట్రీ ఇస్తున్న దునియా విజయ్​

బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడలో మంచి యాక్టర్, ఫిల్మ్ మేకర్​గా పేరొందిన దునియా విజయ్ ప్రేక్షకులను అలరించనున్నారు. విలన్​ రోల్​లో నటించి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్​తో నటించడంపై కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో ముచ్చటించారు.

"బాలయ్య సినిమా 'వీరసింహారెడ్డి'లో నటించే అవకాశం రావడం ఒక వరంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గోపీ మలినేనికి ధన్యవాదాలు. బాలకృష్ణతో విలన్​ రోల్​లో స్క్రీన్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్యబాబు ఎలాంటి ఈగో లేకుండా చిన్న యాక్టర్స్​ను కూడా బాగా ఎంకరైజ్ చేస్తారు. బాలయ్యబాబు ఎంకరైజ్​మెంట్​తో మరింత ఉత్సాహంగా ఈ చిత్రంలో నటించాను."
- దునియా విజయ్ , నటుడు

'వీరసింహారెడ్డి' సినిమాలో ముసలిమడుగు ప్రతాపరెడ్డి క్యారెక్టర్​ రోల్​లో సంక్రాంతి బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ఆయన కన్నడలో 'భీమ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత మంచి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు వస్తే మరిన్ని తెలుగు చిత్రాలలో నటిస్తానని విజయ్ అన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.