ETV Bharat / entertainment

కమల్​హాసన్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​, ఆగిపోయిన సినిమా షూటింగ్​ షురూ - కమల్​హాసన్​ ఇండియన్​ 2 షూటింగ్ షురూ

దిగ్గజ నటుడు కమల్​హాసన్ నటించిన ఓ సినిమా షూటింగ్​ గతంలో పలు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడా చిత్ర షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. ఆ మూవీ ఏంటంటే

Kamalhassan Indian 2 movie shooting started
కమల్​హాసన్​ ఇండియన్​ 2 షూటింగ్​
author img

By

Published : Aug 24, 2022, 10:13 AM IST

యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ అభిమానులకు శుభవార్త. పలు కారణాల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్‌ మళ్లీ ప్రారంభించినట్లు తాజాగా దర్శకుడు శంకర్​ తెలిపారు. సోషల్​మీడియాలో ఈ విషయాన్ని ట్విట్​ చేశారు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొంత భాగం పూర్తైంది. అయితే కరోనా పరిస్థితులు, షూటింగ్‌లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో కొంతకాలం క్రితం షూటింగ్​ మధ్యలోనే ఆగిపోయింది. విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం వల్ల ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల కమల్‌హాసన్ ప్రకటించారు. ఆ తర్వాత హీరోయిన్​ కాజల్​ కూడా ఈ మాట చెప్పింది. వీరిద్దరు చెప్పినట్లుగానే తాజాగా ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ యువ సంచలనం అనిరుధ్.. ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారతీయుడు-2గా తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి: మైక్​టైసన్​తో విజయ్​దేవరకొండ ఫైట్​, పూరి జగన్నాథ్‌ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.