ETV Bharat / entertainment

మరణించిన నటులు తిరిగి తెరపైకి.. 'భారతీయుడు- 2'లో సూపర్​ టెక్నాలజీ - bharateeyudu 2 heroine

Kamal Haasan Indian 2 : దర్శకుడు శంకర్ టెక్నాలజీని వాడటంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా భారతీయుడు - 2 కోసం ఆయన సరికొత్త టెక్నాలజీతో నటులను రీక్రియేట్‌ చేయబోతున్నారు. ఆ వివరాలు..

Kamal Haasan Indian 2
భారతీయుడు 2 కోసం సరికొత్త సాంకేతికత
author img

By

Published : Jul 17, 2023, 10:13 PM IST

Updated : Jul 17, 2023, 10:49 PM IST

Kamal Haasan Indian 2 : తమిళ స్టార్​ హీరో కమల్‌హాసన్‌ - డైరెక్టర్​ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారతీయుడు - 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న ఒకరిద్దరు నటులు షూటింగ్ పూర్తి కాకముందే కన్నుమూశారు. దీంతో మూవీ యూనిట్​కు పెద్ద సమస్య వచ్చి పడినట్లు అయ్యింది. అయితే మూవీ ఇండస్ట్రీలో టెక్నాలజీని అద్భుతంగా వాడుకోవడంలో శంకర్​కు వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఈ సినిమాలో కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి.. మన మధ్య లేనివారిని సైతం కళ్లకు కట్టినట్లు తెరపై చూపించబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరూ.. వారి పాత్రలేంటో చూద్దాం.

Actor Vivek And Nedumudi Venu Death : తమిళ నటుడు వివేక్.. భారతీయుడు - 2 షూటింగ్ ప్రారంభించినప్పుడు సినిమాలో భాగమయ్యారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన షూటింగ్ మొదలైన కొన్ని రోజుల్లోనే గుండెపోటుతో మరణించారు. అలాగే మలయాళ నటుడు నెడుముడి వేణు కూడా భారతీయుడు - 2లో కీలక పాత్ర చేస్తున్నారు. 'భారతీయుడు'లో సేనాపతిని పట్టుకునే పోలీస్‌ అధికారి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొవిడ్ బారిన పడ్డ ఆయన.. తర్వాత కోలుకోలేకపోయారు.

ఇలా ఒకరు గుండెపోటుతో, మరొకరు కరోనా వల్ల కన్నుమూశారు. కానీ వీరు మరణించే ముందు.. షూటింగ్ ప్రారంభమైన కొత్తలో వీరి కాంబినేషన్​లో కీలక సన్నివేశాలు తీశారు. ఇప్పుడు ఆ సీన్స్ రీషూట్ చేయడం వల్ల ఖర్చు, సమయం రెండూ వృధా. అందుకనే డైరెక్టర్ శంకర్ వారి ముఖచిత్రాలను సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) ద్వారా తెరపై చూపించనున్నారు. ఇలాంటి టెక్నాలజీని వాడటం హాలీవుడ్​లో కొత్తేమీ కాదు. కానీ భారతీయుడు - 2 కోసం శంకర్ ఈ సాంకేతికతను వాడటం ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

Indian 2 Cast : కాగా ఈ సినిమా ఇప్పటికే కొవిడ్ కారణంగా, బడ్జెట్ పరిమితుల వల్ల, ఇతర సమస్యలతో షూటింగ్ ఇన్నాళ్లూ ఆలస్యం అయ్యింది. భారతీయుడు - 2 చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Last Updated : Jul 17, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.