ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా 'కేజీఎఫ్-2'. ఇది కన్నడ సినిమా అయినా.. భాషలకతీతంగా ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా మొదటిరోజు హిట్టా టాక్ తెచ్చుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రమఖులు కేజీఎఫ్-2 బృందాన్ని అభినందిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన కమల్ ఆర్ ఖాన్ మాత్రం ట్విట్టర్ వేదికగా భిన్నంగా స్పందించారు.
కేజీఎఫ్-2 సినిమా తీసి.. ప్రశాంత్ నీల్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకులను మోసం చేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసినందుకు ప్రశాంత్ నీల్‌ను జీవితాంతం జైళ్లో పెట్టాలన్నారు. ఇలాంటి మెదడు లేని దర్శకులను ప్రోత్సహించకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై వ్యంగ్యంగా స్పందించారు కేఆర్కే. భారత మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కలిసినా... రాఖీ అనే వ్యక్తితో పోరాడలేకపోయాయన్నారు. ఇలా ఉంటే.. 'పాకిస్థాన్, చైనాతో భారత్ ఎలా పోరాడుతుంది ప్రశాంత్ భాయ్' అని దర్శకుడిని ప్రశ్నించారు. ఈ సినిమా 'ఆర్ఆర్ఆర్ కంటే 10రెట్లు చెత్త సినిమా' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేఆర్కే.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్-2' హిట్ టాక్- బాలీవుడ్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్