ETV Bharat / entertainment

Jr NTR SIIMA Awards : ఫ్యామిలీతో దుబాయ్​కి జూనియర్​ ఎన్​టీఆర్​.. ఎందుకంటే? - సైమా అవార్డుల కోసం జూనియర్​ ఎన్​టీఆర్​

Jr NTR SIIMA Awards : టాలీవుడ్ హీరో జూనియర్​ ఎన్​టీఆర్​ తాజాగా తన కుటుంబంతో కలిసి ఎయిర్​పోర్ట్​లో కనిపించారు. సైమా అవార్డుల కోసం ఆయన దుబాయ్‌ పయనమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్​ అవుతోంది. వాటిని మీరు చూసేయండి..

Jr Ntr Vacation
Jr Ntr Vacation
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 12:43 PM IST

Updated : Sep 14, 2023, 4:25 PM IST

Jr NTR SIIMA Awards : 'దేవర' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న హీరో జూనియర్​ ఎన్​టీఆర్​ తాజాగా తన కుటుంబంతో కలిసి ఎయిర్​పోర్ట్​లో కనిపించారు. సైమా అవార్డుల కోసం దుబాయ్‌ పయనమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్​లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ ఈవెంట్​ కోసం పలువురు సినీ తారలు సైతం దుబాయ్​కు పయనమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యశ్, రిషబ్‌ శెట్టి, హీరోయిన్లు మృణాల్‌ ఠాకూర్‌, శ్రీలీల కూడా సైమా అవార్ట్స్‌ వేడుకలో పాల్గొననున్నారు.

మరోవైపు 'సీతారామం' బ్యూటీ మృణాల్​ ఠాకూర్​ కూడా ఇప్పటికే తన పర్ఫామెన్స్​ కోసం ప్రాక్టీస్​ మొదలెట్టింది. దానికి సంబంధించిన వీడియోను ఇన్​స్టా వేదికగా షేర్​ చేసింది. అలాగే ఈ ఏడాది సైమా అవార్డుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. ఇక 'సీతారామం' చిత్రానికి 10 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. మరోవైపు 'కాంతార', 'కేజీయఫ్‌2' సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. తెలుగులో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్​టీఆర్​, రామ్‌ చరణ్, నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేష్‌ పోటీపడుతున్నారు.

Mrunal Thakur SIIMA Awards
సైమా వేడుకల ప్రాక్టీస్​లో మృణాల్​

ఎన్​టీఆర్​తో సెల్ఫీ పోస్ట్ చేసిన బుల్లితెర నటి..
JR NTR Dubai : మరోవైపు ఎన్​టీఆర్​ వెళ్లిన విమానంలో బుల్లితెర స్టార్​, నటి హిమజ కూడా దుబాయ్ వెళ్లారు. ఇక ఫ్లైటులో వీరిద్దరు కలిసిన ఓ ఫొటోను హిమజ ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది. ఎన్​టీఆర్​ కనిపించిన వెంటనే 'అన్నా' అని పిలిచాంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

JR NTR Devara Movie : ఇక జూనియర్ ఎన్​టీఆర్​ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్​టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్​ సీనియర్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్​ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ​

Tollywood Movies In Summer 2024 : సమ్మర్​ బాక్సాఫీస్ వార్​.. థియేటర్లలో ఆ స్టార్స్​దే సందడి..

JR NTR Mokshagna : ఎన్​టీఆర్​​ను ఆప్యాయంగా హత్తుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడీ ఫొటోనే సోషల్​మీడియా సెన్సేషన్​..

Last Updated : Sep 14, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.