Jr NTR Japan Earthquake: జపాన్ ఇషివాకాలో సోమవారం సంభవించిన వరుస భూకంపాల పట్ల పాన్ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ వారం రోజులు అక్కడే గడిపి, సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే భూకంపం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. 'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి వచ్చాను. భూకంపం గురించి తెలియగానే షాకయ్యా. మేం సేదతీరిన ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా. స్టే స్ట్రాంగ్ జపాన్' అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇక ఎన్టీఆర్ ఇటీవల 'దేవర' షూటింగ్‌తోపాటు, న్యూ ఇయర్ వేడుకలకు జపాన్ వెళ్లారు. అక్కడ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొని తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కాగా, ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
-
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
— Jr NTR (@tarak9999) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵
">Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
— Jr NTR (@tarak9999) January 1, 2024
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
— Jr NTR (@tarak9999) January 1, 2024
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵
-
#TFNExclusive: Man of masses @tarak9999 along with his family lands back in Hyderabad after their #NewYear vacay!✨📸
— Telugu FilmNagar (@telugufilmnagar) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Special mention to #BhargavRam 😍#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/W75MK9nBCP
">#TFNExclusive: Man of masses @tarak9999 along with his family lands back in Hyderabad after their #NewYear vacay!✨📸
— Telugu FilmNagar (@telugufilmnagar) January 1, 2024
Special mention to #BhargavRam 😍#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/W75MK9nBCP#TFNExclusive: Man of masses @tarak9999 along with his family lands back in Hyderabad after their #NewYear vacay!✨📸
— Telugu FilmNagar (@telugufilmnagar) January 1, 2024
Special mention to #BhargavRam 😍#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/W75MK9nBCP
జపాన్ ఇషివాక సముద్ర ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. సోమవారం ఐదు గంటల వ్యవధిలో మొత్తం 50సార్లు భూప్రకంపనలు వచ్చాయి. పలు పాంత్రాలను 5 మీటర్ల ఎత్తులో అలలు తాకినట్లు అధికారులు తెలిపారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది.
ఇక సినిమా విషయానికొస్తే: ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సముద్ర తీర ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీ ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మూవీటీమ్ న్యూఇయర్ సందర్భంగా తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్ 'దేవర'ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
'దేవర' న్యూఇయర్ అప్డేట్- ఫస్ట్ గ్లింప్స్ డేట్ అనౌన్స్ చేశారోచ్
''దేవర' సెట్లోకి వెళితే సొంతింటికి వచ్చినట్లు అనిపిస్తోంది- కారణం అదేనేమో!'