ETV Bharat / entertainment

Jr NTR Goa Trip : గోవాకు వెళ్లనున్న జూనియర్ ఎన్​టీఆర్​​.. అసలు కారణం అదే! - ఎన్టీఆర్ దేవర సినిమా గోవాలో షూటింగ్

Jr NTR Goa Trip : ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్​టీఆర్​ కొద్ది రోజుల్లో గోవాకు ప్రయాణం అవుతన్నారని సమాచారం. అయితే ఇప్పుడు గోవాకు ఎందుకు వెళ్తున్నారు? దీని వెనకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.

Jr NTR Goa Trip : గోవాకు వెళ్లబోతున్న జూనియర్ ఎన్టీఆర్​.. అసలు కారణం అదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 5:28 PM IST

Updated : Oct 21, 2023, 7:16 PM IST

Jr NTR Goa Trip : 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంతో యంగ్​ టైగర్ ఎన్​టీఆర్​ పేరు ఇంటర్నేషనల్​ లెవెల్​లో మారుమోగిపోయింది. ఇక తాజాగా​ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ సభ్యత్వాన్ని దక్కించుకోవటం వల్ల మరోసారి తారక్​ పేరు ట్రెండింగ్​లో వచ్చింది. ఇలా సినీ ప్రపంచంలో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న తారక్​.. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్​తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన మరి కొద్ది రోజుల్లో గోవాకి వెళ్లనున్నారట. ఎందుకంటే..

జూనియర్ ఎన్​టీఆర్​.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగింది. తాజాగా హైదరాబాద్​లో వేసిన ఓ ప్రత్యేక సెట్​లో యాక్షన్​ సీన్స్​ను సైతం షూట్​ చేశారు. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్​ కోసం మూవీ టీమ్​తో కలిసి ఆయన గోవాకు వెళ్లనున్నారని సమాచారం. అక్కడ ఎన్​టీఆర్​,​ హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగలుగా విడుదల చేసేందుకు ప్లాన్​ చేశారట. కల్యాణ్​ రామ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్​టీఆర్​, జాన్వీతో పాటు బాలీవుడ్​ నటుడు సైఫ్ అలీఖాన్​ నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరుద్ ఈ సినిమాకు​ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.

NTR Upcoming Movies: ఈ సినిమా షూటింగ్​ తర్వాత బాలీవుడ్​ యాక్షన్​ స్టార్ హృతిక్ రోషన్​తో కలిసి 'వార్​ 2' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా స్పెయిన్​లో ఈ మూవీ చిత్రీకరణ మొదలైంది. అయితే సినిమా సెట్స్​లోకి తారక్​ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్​ డైరెక్షన్​లో 'ఎన్టీఆర్​ 30' రానునుంది. వచ్చే ఏడాది సమ్మర్​లో ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నాయని నిర్మాతలు తెలియజేశారు.

ఆ అరుదైన ఘనత వల్ల..
ఇటీవలే ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో జూనియర్ ఎన్టీఆర్​కు చోటు దక్కడం పట్ల ఆయన ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కిగా... వీరిలో తారక్​తో పాటు కే హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు.

NTR Oscar : ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్​ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు

War 2 Movie Shooting : వార్ 2 షూటింగ్​ షురూ.. ఫొటోలు లీక్​.. తారక్​-హృతిక్​ ఎక్కడ?

Last Updated : Oct 21, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.