ETV Bharat / entertainment

ఆ ఆలోచనలు చాలా భయపెట్టేవి.. బాధపడేదానిని: సుమ

Anchor Suma Career: తన తల్లిదండ్రులు అందించిన క్రమశిక్షణ వల్లే జీవితంలో అన్నింటినీ సమన్వయం చేసుకోగలిగే శక్తి వచ్చిందని అన్నారు యాంకర్​ సుమ. రేపేం చేయాలో ఈరోజే ప్రణాళిక వేసుకుంటానని చెప్పారు. గతంలో కొన్ని ఆలోచనలు తనను చాలా భయపెట్టేవని, దాంతో విపరీతంగా బాధపడినట్లు తెలిపారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా కెరీర్​ సహా ఓ అమ్మగా తన వ్యక్తిగత విషయాలను తెలిపారామె. ఆ సంగతులివీ..

Anchor Suma Jayamma Panchayati
యాంకర సుమ జయమ్మ పంచాయితీ
author img

By

Published : May 8, 2022, 8:32 AM IST

Anchor Suma Career: సుమ.. తెలుగునాట ప్రతి ఇంట్లో ఆమె సభ్యురాలే. స్వచ్ఛమైన తెలుగుతో, సరదా సంభాషణలతో అందరూ 'మన' అనుకునేలా చేసింది. తెరమీద తనేంటో మనకు తెలుసు. తెర వెనుక.. ముఖ్యంగా అమ్మగా 'సుమ' ఏంటి? అన్న ప్రశ్నకు సుమ సమాధానం చెప్పింది. ఆ సంగతులేంటో చదివేయండి.

నా 30 ఏళ్ల ప్రయాణాన్ని చూసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. పదో తరగతి పూర్తవగానే టీవీ రంగంలోకి వచ్చా. అయితే అప్పటికే ఇందుకు కావాల్సిన శిక్షణంతా ఇంట్లోనే పూర్తయిందేమో అనిపిస్తుంది. అమ్మ విమల, నాన్న కుట్టి అందించిన క్రమశిక్షణ జీవితంలో అన్నింటినీ సమన్వయం చేయగలిగే శక్తినిచ్చింది.

రెంటినీ ఎలా? ఓవైపు ఇంటిని చూసుకుంటూనే మనం బయటి పనులూ చేస్తాం. ఎక్కడ ఉన్నా ఇంటిపైనే ధ్యాస. ఒకరకంగా ఇల్లు మన కనుసన్నల్లోనే నడుస్తుంది. కాబట్టి.. మనం.. వర్కింగ్‌ విమెన్‌ కాదు.. హౌస్‌ వైఫ్‌ ఫర్‌ వర్కింగ్‌ అంటే సరిగా సరిపోతుందేమో! ఏరోజుకారోజు హడావుడి పడిపోను. రేపేం చేయాలో ఈరోజే ప్రణాళిక వేసుకుంటా. వంట చేసి, పిల్లలను సిద్ధం చేసి, స్కూల్‌కు పంపి.. ఆపై షూటింగ్‌కు వెళ్లిన సందర్భాలెన్నో. ఒత్తిడి అనిపిస్తుంది. అలాగని ఆందోళనపడితే మన శక్తి హరించుకుపోతుంది కదా! అందుకే వీలైనంత దూరంగా ఉంటా.

స్వయంగానే..! మా బాబు రోషన్‌ పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. వాడీ లోకంలోకి వచ్చినపుడే.. నా ధ్యాసంతా వాడిపైనే పెట్టాలని నిర్ణయించుకున్నా. తర్వాత అయిదున్నరేళ్లకు స్నేహ మనస్విని పుట్టింది. ఇద్దరినీ చూసుకుంటూనే కెరియర్‌ కొనసాగించా. చాలామందికి పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక కెరియర్‌లో విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. అదే కుటుంబం కొంచెం చేయూతనిస్తే కెరియర్‌ను కొనసాగించగలుగుతారు. లేదంటే ఎంతో కష్టపడి చదివినదంతా వృథానే కదా!

భయం.. బాధపడ్డ క్షణాలు.. బాబు పసివాడిగా ఉన్నప్పుడు షూటింగ్‌ మధ్యలో గంటా, రెండు గంటలు విరామం తీసుకొని వెళ్లి పాలు ఇచ్చి వచ్చేదాన్ని. ప్రయాణం మధ్యలో అనుకోకుండా కారు బ్రేకులు పడకపోయినా.. ఏదైనా ప్రమాదం జరిగినా ఏంటి పరిస్థితి? నా బాబు ఏమైపోతాడో అన్న ఆలోచనలు భయపెట్టేవి. ఒక్కోసారి వెళ్లడానికి వీలుండేది కాదు. అలాంటప్పుడు తననే షూటింగ్‌కి తీసుకొచ్చేసే దాన్ని. కాస్త పెరిగి, పెద్దయ్యాక స్కూలు నుంచి రాగానే 'అమ్మా.. ఎప్పుడొస్తావ్‌?' అంటూ పేచీ పెట్టేవాడు. ఒక్కోసారి లొకేషన్‌కీ వచ్చేసే వాడు. ఇక మా అమ్మాయి.. అప్పుడు తనకి అయిదారేళ్లు ఉంటాయేమో! ఓసారి 'నిన్ను చూడాలనిపిస్తే టీవీలోనే చూడాలా' అని అడిగింది. ఆ మాటలు నా గుండెను పిండేశాయి. అప్పుడు ప్రీ రిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్లంటూ చాలా పని ఉండేది మరి! ఇంకోసారి 'వాళ్లు నిన్నే ఎందుకు పిలుస్తారు' అంది. ఇల్లు గడవాలి, మన ఖర్చులు ఇలా ఉంటాయి.. వీటన్నింటికీ డబ్బులు కావాలని సర్దిచెప్పా. అప్పుడు తను 'నాకే బొమ్మలూ వద్దు... నువ్వే కావాలి' అంది. దాంతో.. తను నన్నెంత మిస్‌ అవుతోందో అర్థమైంది. తర్వాత నుంచి పని తగ్గించుకున్నా. పిల్లలకు అనువుగా ఉండేలా నా పని తీరు మార్చుకున్నా. అవసరమైతే వాళ్లనీ షూటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ అయితే అక్కడే పిల్లలను తయారుచేసి స్కూల్‌కు పంపిన రోజులెన్నో!

Anchor Suma Jayamma Panchayati and family
యాంకర్ సుమ ఫ్యామిలీ

అమ్మగా కష్టమే.. ఒకరోజు షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్నా. అమ్మాయి నుంచి ఫోన్‌! తను కడుపునొప్పితో ఏడుస్తోంటే మనసు విలవిల్లాడింది. ఆ క్షణం తనకంటే పదిరెట్లు ఎక్కువ నొప్పి నేననుభవించా. ఎక్కడి పని అక్కడే వదిలేసి పరుగుతీశా. తనని ఆసుపత్రిలో చేర్చే వరకూ మనసు కుదుటపడలేదు. మరోసారి మా అబ్బాయి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు. మళ్లీ అంతే. షూటింగ్‌ ఆపి పరుగుపెట్టా. ఇలాంటి సందర్భాల్లో అమ్మగా మన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మరి.
నో చెబుతారా?.. కొన్ని సందర్భాల్లో తప్పదు. నో చెప్పాలి. అయితే అది కఠినంగా ఉండ కూడదు. మృదువుగానే చెప్పాలి. ముందు నిరుత్సాహపడ్డా, తర్వాత అర్థం చేసుకుంటారు. మా పాప బైక్‌ అడిగింది. బాబు కారు కావాలన్నాడు. కానీ లైసెన్స్‌ ఇచ్చే వయసు వచ్చే వరకూ అవి ఇవ్వడం కుదరదు, చట్టాన్ని అతిక్రమించకూడదు అని కచ్చితంగా చెప్పేశా.

పేరెంట్‌ మీటింగ్స్‌కు... పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన విషయం కదా! తప్పక వెళతా. ఒక్కోసారి మీటింగ్‌ల గురించి అప్పటికప్పుడు తెలిసేది. నాకేమో ప్రోగ్రామ్‌లుండేవి. అయినా వాళ్లను ఒప్పించి మరీ హాజరయ్యే దాన్ని. టీచర్లు చెప్పేవన్నీ నోట్‌ చేసుకునేదాన్ని. పెద్ద పెద్ద కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటా. నా పిల్లల స్కూళ్లలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లకపోతే వాళ్ల మనసు చివుక్కుమంటుంది. అందుకే వీలైనంత వరకూ అన్నింటికీ వెళ్లే దాన్ని.

పాటించే చిట్కా.. మాట ఇస్తే తప్పక నిలబెట్టుకుంటా. సమయపాలన, క్రమశిక్షణలకు విలువనిస్తా. మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం, యోగా, ధ్యానం వంటివన్నీ అనుసరిస్తా. అప్పుడే కదా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి అన్నింటినీ సమన్వయం చేసుకోగలం! ఏ విషయమైనా బాగా చికాకు పరుస్తోంటే దాన్ని కాగితంపై రాసి చించేస్తుంటా. ఈ థెరపీతో మనసంతా తేలికవుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

'జయమ్మ పంచాయితీ'లో.. ఓ తల్లి తన కుటుంబాన్ని, పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి తెగింపునైనా ప్రదర్శిస్తుందనే దానికి పెద్ద నిదర్శనం జయమ్మ పాత్ర. అందుకే ఇది అమ్మలందరికీ అంకితం. ఓ మంచి సినిమాలో నేనూ భాగమవ్వడం చాలా గర్వంగా ఉంది.
మాతృదినోత్సవం సందర్భంగా... బిడ్డకు జన్మనిచ్చినప్పుడు... తల్లి కూడా మళ్లీ పుడుతుంది. తల్లికన్నా ప్రపంచంలో శక్తిమంతులెవరూ లేరు. నేను ఇటీవల నటించిన సినిమా కూడా అమ్మకు సంబంధించిందే!

యాంకర్ సుమ

పిల్లల నుంచి ఫిర్యాదులొస్తాయా.. నా కొడుకే ఎక్కువగా పాపను విసిగిస్తుంటాడు. అప్పుడే అమ్మా అంటూ అరిచి గోలపెడుతుందది. వెంటనే నాకు అర్థమవుతుంది. నేను వెళ్లి పంచాయితీ పెట్టాల్సిందే. వాళ్ల నాన్న కన్నా పెద్ద పంచాయితీలు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి షూటింగ్‌లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఫిర్యాదులు తెస్తారు. వాటిని తీర్చిన తర్వాతే నిద్రపోవడం కుదురుతుంది. కొన్ని సందర్భాల్లో మనమెంత బిజీగా ఉన్నా... నా కోసమే కూర్చుని మరీ నాతో బలవంతంగా వండించుకుని తింటారు మావాళ్లు. అంతేకాదు..ప్రపంచంలో ఎన్ని బ్యూటీపార్లర్స్‌ ఉన్నా.. మా అమ్మాయికి తలకు నూనె నేను మాత్రమే మర్దనా చేయాలి. ఎంత రాత్రి అయినా..నేను అలసిపోయి వెళ్లిన వెంటనే నూనె సీసా తీసుకొచ్చి కూర్చుంటుంది.

పిల్లల పెంపకంలో మీవారితో ఏదైనా బేధాభిప్రాయాలు వచ్చాయా.. ఇంట్లో పిల్లల గురించి అన్నీ నాకు తను వదిలేస్తాడు. అయితే పిల్లలకు తను భయం చెప్పేటప్పుడు నేను మధ్యలో వెళితే ఎందుకలా మధ్యలో వస్తావని కోప్పడేవాడు. ఆ తర్వాత అలా చేయడం మానేశా.

పిల్లల కెరీర్‌లో ఫ్రీడం ఇచ్చారా.. వాళ్లకిష్టమైన రంగాల్లో అడుగుపెట్టడానికి స్వేచ్ఛనిచ్చాం. నటన అంటే రోషన్‌కిష్టం. త్వరలో సినిమా ప్రారంభంకానుంది. కెరియర్‌తోపాటు చదువుకూడా ఉండాలంటే డిగ్రీ పూర్తిచేశాడు. మనస్విని కూడా తనకిష్టమైందే చదువుతోంది. ఇద్దరినీ సమానభావాలతోనే పెంచా.

మీరెలా ఉండాలని వాళ్లు కోరుకుంటారు.. నేనెలా ఉన్నానో అలాగే ఉండాలంటారు. నేనిలా ఉండటమే వాళ్లకిష్టం. ఏటా వారికి సెలవులిచ్చినప్పుడు మాల్దీవులు, గోవా, స్విట్జర్‌లాండ్‌కు టూర్స్‌కు వెళుతుంటాం. కొన్నేళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూస్తే అవన్నీ మధురజ్ఞాపకాలే.

మీ అమ్మగారి గురించి చెప్పండి.. తను నాకు సలహాదారురాలు. ఇప్పటికీ నాకు సలహాలు, సూచనలిస్తూనే ఉంటుంది.

సమన్వయపాలన గురించి.. మనం ఒక్కటే దీన్ని పాటిస్తే సరిపోదు, నాకూడా ఉన్న సిబ్బందినంతా పాటించేలా చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు దక్కుతాయి. సమయానికి పనులు సజావుగా సాగుతాయి.

ఇదీ చూడండి: రివ్యూ: 'జయమ్మ పంచాయితీ'లో సుమ మెప్పించారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.