ETV Bharat / entertainment

Jawan Trailer Announcement : బుర్జ్​ ఖలీఫాపై జవాన్ ట్రైలర్.. రిలీజ్​ డేట్ ఫిక్స్ - జవాన్ సినిమా విడుదల

Jawan Trailer Announcement : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ - డైరెక్టర్ అట్లీ కాంబినేషన్​లో రానున్న సినిమా జవాన్. హీరో షారుక్ ఈ సినిమా గురించి తాజాగా ఓ సాలిడ్ అప్​డేట్ ఇచ్చారు. ఆ వివరాలు.

Jawan Trailer Announcement
Jawan Trailer Announcement
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 10:30 PM IST

Updated : Aug 28, 2023, 10:58 PM IST

Jawan Trailer Announcement : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్​ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్​ ఓ రేంజ్​లో సాగుతున్నాయని ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్​ క్రియేట్​ అవుతోంది. అయితే హీరో షారుక్​ ఖాన్ తాజాగా ఈ సినిమా గురించి అదిపోయే అప్​డేట్ ఇచ్చారు. అదేంటంటే

ద వెయిట్ ఈజ్ ఓవర్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షారుక్ ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్​ ఇచ్చే న్యూస్. ఈ సినిమా ట్రైలర్​ను ఆగస్టు 31 న రాత్రి 9 గంటలకు, ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖాన్ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. " మీతో కలిసి జవాన్ సంబరాలు జరుపుకునేందుకు ఆగస్టు 31 రాత్రి 9 గంటలకు నేను బుర్జ్ ఖలీఫా వస్తున్నా. ప్రపంచంలో ప్రేమ అనేది అందమైన ఫీలింగ్.. ఆ ప్రేమలో మునిగిపోదాం ఏమంటారు" అని షారుక్ ట్వీట్ చేశారు.

  • Jawan ka jashn main aapke saath na manau yeh ho nahin sakta. Aa raha hoon main Burj Khalifa on 31st August at 9 PM and celebrate JAWAN with me. And since love is the most beautiful feeling in the world, toh pyaar ke rang mein rang jao and lets wear red...what say? READYYYY! pic.twitter.com/IUi4AkGrZy

    — Shah Rukh Khan (@iamsrk) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రఖ్యాతిగాంచిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) బిల్డింగ్​పై షారుక్ సినిమా ట్రైలర్​ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్​ (Pathan Trailer)ను ఇదివరకే అక్కడ ప్రదర్శించారు. అయితే అప్పుడు ట్రైలర్ విడుదలైన నాలుగు రోజుల తర్వాత ఈ వేడుక జరిపారు. కానీ ప్రస్తుత జవాన్ సినిమా ట్రైలర్​ను డైరెక్ట్​గా బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేయనున్నారు. ఇక పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకొని.. వసూళ్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే.

Jawan Cast : ఇక జవాన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నారు. ఈ మూవీలో షారుక్ ​మునుపెన్నడు లేని లుక్​లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ జవాన్​ను భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్​లో థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అల్లు అర్జున్ సినిమాలు చూసి జవాన్​లో నటించా'

వెయ్యి కోట్ల "పఠాన్".. యశ్​రాజ్​ ఫిల్మ్స్ బంపర్ ఆఫర్.. "బాద్​షా" సరికొత్త చరిత్ర!

Last Updated : Aug 28, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.