Jawan Movie OTT Release : బాక్సాఫీస్ ముందు రిలీజయ్యే సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఏదైనా సినిమాను థియేటర్లో చూసే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆడియెన్స్ దాన్ని ఓటీటీలో చూసేందుకు ప్లాన్ చేసుకుంటారు. దీన్ని అదునుగా చేసుకుంటున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్.. పలు బడా సినిమాల ఓటీటీ రైట్స్‌ను ముందుగానే కొనుగోలు చేసుకుని.. మూవీ విడుదలైన ఒకటి లేదా రెండు నెలల్లో ఆ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమ్ చేస్తుంటారు. ఆడియెన్స్ కూడా ఆ చిత్రాలను ఓటీటీలో చూసేందుకు తగినంత రుసుము చెల్లించి ఆ కంటెంట్‌ను ఆస్వాదిస్తుంటారు.
ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బర్త్‌డే (నవంబర్ 2) సందర్భంగా ఆయన లేటెస్ట్ హిట్ మూవీ 'జవాన్'ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేశారు. 'జవాన్ ఎక్స్టెండెడ్ కట్' అనే పేరుతో ఈ చిత్రాన్ని ఆడియెన్స్ కోసం స్టీమింగ్ చేస్తున్నారు. థియేటర్లో 'జవాన్' థ్రిల్ మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఆస్వాదిద్దామని అనుకుంటే.. ఆఖరికి వారికి నిరాశే మిగిలింది.
సాధారణంగా ఎక్స్టెండెడ్ కట్.. థియేటర్లో విడుదైన మూవీ ప్రింట్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. డిలీటెడ్ సీన్స్, బిహైండ్ ద సీన్స్, సాంగ్స్ ఇలా ఈ ఓటీటీ ప్రింట్లో చాలా కంటెంట్ ఉంటుంది. స్క్రీన్ టైమ్ కారణంగా థియేటర్లో చూపించలేని కంటెంట్‌ను ఈ ఓటీటీ ప్రింట్లో డంప్ చేస్తుంటారు. దీని వల్ల డిజిటల్ కంటెంట్ చూసే అభిమానులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది.
హాలీవుడ్లో ఇలా తెరకెక్కి ఓటీటీల్లోనూ అలరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇండియాలో మాత్రం ఈ ఎక్స్టెండెడ్ కట్ అనే పదాన్ని కేవలం మార్కెటింగ్ జిమ్మిక్‌గా ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఓటీటీల వ్యూవర్షిప్ల కోసమే ఇదంతా చేస్తున్నారని టాక్. తాజాగా విడుదలైన 'జవాన్' ఈ విషయంలోనూ ఇదే జరిగింది. థియేటర్లో మిస్ అయిన కంటెంట్‌ను చూద్దామని.. అలాగే ఓటీటీలో మరోసారి సినిమా చూద్దామని అనుకున్న అభిమానులకు అసంతృప్తే మిగిలింది. థియేట్రికల్ వెర్షన్‌కు వెబ్ ప్రింట్ మధ్య 5 నిమిషాల తేడా మాత్రమే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అయితే ఇదొక్క సినిమానే కాదు.. తాజాగా ఓటీటీలోకి వచ్చిన 'పఠాన్', 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' సినిమాలు కూడా ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో ప్రేక్షకులను నిరాశపరిచాయి. భారీ ఆశలు పెట్టుకుని వెబ్ వెర్షన్ చూస్తే.. అందులో డిలీటెడ్ సీన్స్‌తో పాటు కొన్ని సాంగ్స్‌తో మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రేక్షకులను నిరాశకు లోనయ్యారు.
Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్ అప్సెట్.. ఇక హిందీ చిత్రాలు బంద్!.. అసలేం జరిగిందంటే?
Lehar Khan Jawan Movie : 'జవాన్' సినిమాలో కల్కి.. అందులోనూ ఇంపార్టెంట్ రోల్ చేసిందిగా!