ETV Bharat / entertainment

Jawan Day 3 Collections : బాక్సాఫీస్ వద్ద కింగ్​ ఖాన్ మేనియా​ .. థియేటర్లలో 'జవాన్' ఫ్యాన్స్​ సంబరాలు - జవాన్ మూవీ బాక్సాఫీస్​ కలెక్షన్స్

Jawan Day 3 Collections : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జవాన్' మూవీ ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ రికార్డులు క్రియేట్​ చేస్తోంది. తొలి రెండు రోజుల్లోనే 200 కోట్ల మార్క్​ దాటిన ఈ సినిమా.. మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్​ అందుకుని చరిత్రకెక్కింది. ఆ విశేషాలు మీ కోసం..

Jawan Day3 Collections
Jawan Day3 Collections
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:12 AM IST

Jawan Day 3 Collections : ఎక్కడ చూసినా ఇప్పుడు 'జవాన్' మేనియా నడుస్తోంది. సెప్టెంబర్​ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద సంచలనాలు సృష్టించుకుంటూ దూసుకెళ్తోంది. తొలి రోజు సుమారు రూ.75 కోట్లు సంపాందించిన ఈ మూవీ.. రెండో రోజు దాదాపు రూ.53 కోట్లు అందుకుంది. ఇక మూడో రోజు ఈ సినిమా రూ. 74 కోట్లకు పైగా కలెక్షన్స్​ సంపాదించి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రెండు రోజుల్లో 240 కోట్లు అందుకున్న ఈ చిత్రం.. ఈ మూడో రోజు కలెక్షన్​తో 300 కోట్ల మార్క్​ను దాటేసింది. చూస్తుంటే వీకెండ్స్​లో ఈ సినిమా ఇంతకంటే ఎక్కువ సంపాదించి త్వరలోనే 500 కోట్ల మార్క్​ను దాటేలా ఉందని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Shahrukh Fans Celebrations : మరోవైపు ఈ సినిమా రిలీజ్​ను ఓ పండుగలా చేసుకున్న అభిమానులు ఆ వేడుకలను ఇంకా కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్ల వద్ద కింగ్ ఖాన్ ఫ్యాన్స్​.. షారుక్​ భారీ కటౌట్​కు పాలాభిషేకం చేస్తున్నారు. డ్యాన్స్​లు, బాణాసంచాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక స్క్రీన్​పై ఆయన కనిపించినప్పుడల్లా షారుక్ నినాదాలతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Jawan Cast and Crew : ఈ సినిమాలో షారుక్​తో పాటు కోలీవుడ్​ లేడీ సూపర్​స్టార్​ నయనతార నటించారు. ఆమె ఓ ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్ పాత్ర పోషించారు. మరోవైపు బాలీవుడ్‌ దివా​ దీపికా పదుకొణె, స్టార్​ హీరో సంజయ్‌ దత్‌ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్‌ రవిచందర్​ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. రాజా రాణీ ఫేమ్​ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై గౌరీ ఖాన్​ నిర్మించారు. సాంగ్స్​, హిందీ ప్రివ్యూ, ట్రైలర్​ ఇలా అన్నీ అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

Jawan Google Animation : యానిమేషన్​తో గూగుల్ సర్​ప్రైజ్.. ఆ రికార్డు బద్దలుకొట్టారంటూ..'జవాన్​' పై మహేశ్ బాబు ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.