ETV Bharat / entertainment

Jailer Villain Arrest : 'జైలర్‌' విలన్​ అరెస్ట్​.. మద్యం తాగి పోలీస్​ స్టేషన్​లో గొడవ

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 6:24 AM IST

Updated : Oct 25, 2023, 8:14 AM IST

Jailer Villain Arrest : 'జైలర్‌' చిత్రంలో విలన్​గా నటించిన ప్రముఖ మలయాలీ నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలు..

.
.

Jailer Villain Arrest : సూపర్ స్టార్​ రజనీకాంత్ నటించిన 'జైలర్‌' చిత్రంలో విలన్‌ ప్రముఖ మలయాలీ నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌నార్త్‌ పోలీస్‌స్టేషన్‌లో మద్యంమత్తులో ఆయన గొడవకు దిగడం వల్ల అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. తమను వినాయకన్‌ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు ఫిర్యాదు చేశారట. దీంతో వినాయకన్‌ను పోలీసులు స్టేషన్‌ను పిలిపించారు.

ఈ క్రమంలో మద్యం మత్తుతో ఉన్న వినాయకన్‌ సహనం కోల్పోయి గొడవకు దిగినట్లు తెలిసింది. అతడిని వారించేందుకు పోలీసులు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల కేసు నమోదు చేసి అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వినాయకన్‌(jailer villain arrested) అరెస్ట్​ అవ్వడం తొలిసారి కాదనీ ఓ మోడల్‌ను వేధించిన కారణంగా గతంలోనూ అరెస్ట్‌ అయ్యారని.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయినట్లు వార్తలొచ్చాయి. జైలర్‌ సినిమా విడుదలైన సమయంలో ఈ కథనాలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.

బెయిల్​పై విడుదల.. వినాయకన్​ అరెస్ట్​పై అక్కడి సర్కిల్ ఇన్​స్పెక్టర్​ ప్రతాపచంద్రన్​ స్పందించారు. పోలీస్ స్టేషన్​లో గొడవ సృష్టించినందుకు వినాయకన్​పై కేసు నమోదు చేశాం. ఆ తర్వాత బెయిల్​పై రిలీజ్ చేశాం. స్టేషన్​లో ఓ పోలీస్ అధికారితో అతడు దురుసుగా ప్రవర్తించాడు." అని పేర్కొన్నారు.

Jailer Villain Movies List : కాగా, మలయాళీ యాక్టర్ అయిన వినాయకన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా కాలం క్రితం నుంచే పరిచయం. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన అసాధ్యుడు చిత్రంతో ఆయన టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ ఆయన కపడలేదు. అయితే కొన్ని డబ్బింగ్‌ సినిమాల్లో విలన్‌ పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్​గా జైలర్ చిత్రంలో వర్మ వర్త్ అంటూ విలన్​గా ప్రేక్షకుల్ని బాగా అలరించారు. అంతే కాదు చిత్రంలో ఫన్నీ డ్యాన్స్‌తోనూ(Jailer Villain Dance) నవ్వించారు. ఆయన పాత్ర బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో మీమర్స్‌కు వినాయకన్‌ డ్యాన్స్‌ మంచి స్టప్​గా బాగా ఉపయోగపడింది. బాగా ట్రెండ్ అయింది. త్వరలోనే విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రంతో వినాయకన్‌ విలన్‌గా అలరించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇకపోతే వినాయకన్​లో మంచి డ్యాన్సర్‌, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఉన్నారు.

స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్​​ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు!

Rajinikanth Sharukh Khan : గత పదేళ్ల లెక్క తేల్చేశారు.. రూ.2500కోట్లు

Last Updated : Oct 25, 2023, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.