ETV Bharat / entertainment

Jailer Box Office Collection : తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' సందడి.. తొలి రోజు కలెక్షన్స్​ ఎంతంటే ? - జైలర్ సినిమా తొలిరోజు కలెక్షన్లు

Jailer Box Office Collection : రజనీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్ కాంబోలో విడుదలైన 'జైలర్' మూవీ ఇప్పుడు కలెక్షన్లవలో దూసుకెళ్తూ సంచలనాలు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?

Jailer box office collection
జైలర్​ బాక్సాఫీస్​ కలెక్షన్స్
author img

By

Published : Aug 11, 2023, 1:51 PM IST

Updated : Aug 11, 2023, 3:13 PM IST

Jailer Box Office Collection: కోలీవుడ్​ సూపర్​ స్టార్​ రజనీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్ కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ 'జైలర్'. సూమారు 7000 స్క్రీన్‌లపై గురువారం గ్రాండ్​గా రిలీజైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్‌తో బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కాగా.. తెలుగులోనూ తొలిరోజు కలెక్షన్స్​ అంచ‌నాల‌కు మించి రాబ‌ట్టింది.

Jailer Day 1 Collections : తెలుగులో రెండు రాష్టాల్లో కలిపి ఈ సినిమా రూ.13 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, ఏడు కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. సీడెడ్‌లో రూ.కోటి, ఉత్త‌రాంధ్ర‌లో రూ.90 ల‌క్ష‌లు, గుంటూరులో రూ. 65 ల‌క్ష‌లు, కృష్ణ‌ాలో రూ. 50 ల‌క్ష‌లు మేర కలెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. తెలుగులో రిలీజైన ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబ‌ట్టిన రెండో సినిమాగా చరిత్రకెక్కింది.

Jailer Movie Opening Collection : ఓ ప్రముఖ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం 'జైలర్' సినిమా ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి తొలి పోజు రూ. 44.50 కోట్లు నెట్​ వసూలు చేసిందట. ఈ క్రమలో తొలిరోజు ఈ సినిమా రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్​ వర్గాల టాక్​. అందులో తమిళనాడు నుంచి రూ.23 కోట్లు, కర్ణాటక నుంచి రూ.11 కోట్లు, కేరళ నుంచి రూ.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ.10 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.3 కోట్లు వరకు వసూలు రాబట్టిందని టాక్​.

Jailer Movie Budget : ఇకపోతే దాదాపు రూ.200 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా.. జైసల్మేర్, మంగళూరు హైదరాబాద్​, చెన్నై సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్​ సహా మిల్కీ బ్యూటీ​ తమన్నా, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ జాకీ ష్రాఫ్‌, సీనియర్ నటి రమ్యకృష్ణ, టాలీవుడ్ విలక్షణ నటుడు సునీల్‌ వంటి భారీ తారాగణంతో (Jailer Movie Cast) 'జైలర్'​ తెరకెక్కింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జైలర్‌' రిలీజ్‌.. చెన్నై, బెంగళూరు ఆఫీస్​లకు హాలీడే.. ఫ్రీగా టికెట్లు.. ఇది కదా రజనీ క్రేజ్‌ అంటే!

Rajinikanth Jailer Trailer : పవర్​ఫుల్​గా 'జైలర్' ట్రైలర్​.. రజనీ అదే స్టైల్, అదే స్వాగ్.. ఎక్కడా తగ్గలే

Last Updated : Aug 11, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.