ETV Bharat / entertainment

స్క్రిప్ట్ లేకుండానే రూ.55 కోట్ల అడ్వాన్స్.. ఎవరబ్బా ఆ డైరెక్టర్​?

55 Crore Advance To Director : ఏదైనా సినిమాను తెరకెక్కించాలంటే దానికి స్క్రిప్ట్​ ఎంతో అవసరం. కథకు తగ్గట్టుగా స్క్రిప్ట్​ను మలుచుకోవడం ఒక ఎత్తు అయితే.. నిర్మాతలకు ఆ కథను చెప్పి ఒప్పించడం మరో ఎత్తు. కథ సూపర్​గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు దాని అమలు చేయడంలో విఫలమవ్వడం వల్ల.. నిర్మాతలు కూడా కథ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో వారిని ఒప్పించడం డైరెక్టర్​కు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆ డైరెక్టర్​ చెప్పిన కథ నచ్చితే నిర్మాతలు ఓకే చెప్తారు. ఇది సాధరణంగా జరిగే విషయమే. కానీ తాజాగా ఓ నిర్మాత మాత్రం ఎటువంటి స్క్రిప్ట్ లేకున్నా.. ఆ డైరెక్టర్​కు రూ.55 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు.

Jailer 2 Director Advance
Jailer 2 Director Advance
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 6:42 AM IST

55 Crore Advance To Director : ఓ సినిమాను సక్సెస్​ఫుల్​గా తెరకెక్కించాలంటే దాని వెనుక డైరెక్టర్​ శ్రమ ఎంతో ఉంటుంది. కొందరు వేరే వాళ్లు రాసిన కథను తీస్తారు. మరకొందరు సొంత కథనే తెరకెక్కిస్తారు. వారు రాసుకున్న స్క్రిప్ట్​ను నిర్మాతకు వినిపించి ఒప్పిస్తారు. అది వారికి నచ్చితే సినిమా తీయడానికి ఒప్పుకుని ఆ డైరెక్టర్​కు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ ఇస్తారు. తర్వాత అది సినిమాగా మన ముందుకు వస్తుంది.

ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది డైరెక్టర్లు తన హిట్లతో హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదిస్తున్నారు. తెలుగులో రాజమౌళి, త్రివిక్రమ్, బాలీవుడ్​లో రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరాణీ లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. హిట్ సినిమాలు తీసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషికాలను కూడా అందుకుంటున్నారు. అయితే నిర్మాతలు ముందుగా స్క్రిప్ట్​ విని ఆ తర్వాతే అడ్వాన్స్ ఇస్తారు. కానీ దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ మాత్రం ఎటువంటి స్టోరీ వినకుండానే నిర్మాత నుంచి రూ.55 కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. అతను మరెవరో కాదు.. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. 'జైలర్' సినిమాతో అటు రజనీకాంత్​కు ఇటు సన్​ పిక్చర్స్​కు భారీ హిట్​ను అందించిన ఈ స్టార్ డైరెక్టర్​ ఈ భారీ మెత్తానికి అందుకుని ట్రెండింగ్​లో ఉన్నారు.

జైలర్​ సినిమా అందుకున్న విజయాన్ని చూసిన దర్శకుడు ఆ సినిమాను సీక్వెల్​గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్క్రిప్ట్​ వినకుండానే సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత కళానిథి మారన్. ఇలా కథ వినకుండా డైరెక్టర్​కు అంత సొమ్ము ఇవ్వడానికి కారణం జైలర్ అందుకున్న సక్సెస్​ అని విశ్లేషకుల అభిప్రాయం.

Rajinikanth Movies List : అయితే 'జైలర్​' సీక్వెల్​ పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయం పడుతందని సమాచారం. రజనీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ తర్వాత తన కుమార్తె తెరకెక్కించిన లాల్​ సలామ్ సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఆయన.. ఆ తర్వాత జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్​తో 'తలైవర్​ 170', అలాగే లోకేశ్ కనగరాజ్​తో 'తలైవర్​ 171' సినిమాలకు సైన్​ చేశారు. ఇవన్నీముగిశాకే.. సన పిక్చర్ బ్యానర్ పై 'జైలర్ 2' రూపొందనుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్​ కోసం ఫ్యాన్స్ ఇంకొద్ది రోజులు వెయిట్​ చేయక తప్పదు.

Jailer Movie Chiranjeevi : 'జైలర్​'లో హీరోగా అనుకున్నది రజనీని కాదా? చిరునా?.. అయ్యో మంచి హిట్​ మిస్సయ్యారే!

Jailer Gold Coins : 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్.. 300 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్​.. బిర్యానీ పెట్టించి మరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.