ETV Bharat / entertainment

'రవితేజతో త్వరలోనే మరో సినిమా.. 'ధమాకా'కు శ్రీలీల స్పెషల్​ అట్రాక్షన్​'

author img

By

Published : Dec 25, 2022, 9:24 AM IST

Updated : Dec 25, 2022, 9:46 AM IST

అనుకోని రీతిలో ధమాకా సినిమాకు మంచి ఆదరణ రావడం తమకెంతో సంతోషంగా ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ధమాకా' చిత్రాన్ని ఆయనే నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ముచ్చట్లు మీకోసం..

interview with dhamaka movie director vishwaprasad
టి.జి.విశ్వప్రసాద్‌.

"మాస్‌ వినోదంతో కూడిన కథ ఇది. రవితేజలోని ఉత్సాహమంతా ఇందులో కనిపిస్తుంది. బీ, సీ కేంద్రాల్లో సందడి ఎలా ఉంటుందో మాకు ముందే తెలుసు. కానీ మల్టీప్లెక్స్‌ల్లో కూడా అంతే హంగామా కనిపిస్తోంది. యువతరంతోపాటు.. కుటుంబ ప్రేక్షకులూ ఆస్వాదిస్తున్నారు. అందుకే ఇంత ఘనమైన ప్రారంభ వసూళ్లు. మేం ఊహించని స్పందన ఇది" అన్నారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ధమాకా' చిత్రాన్ని నిర్మించారు. రవితేజ, శ్రీలీల జంటగా నటించారు. చిత్రానికి లభిస్తున్న స్పందనపట్ల ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం విలేకర్లతో ముచ్చటించారు.

  • "ఒక ఫ్యాక్టరీ తరహాలోనే పని చేయాలని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించాం. వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలతో, మరిన్ని మంచి చిత్రాలు, ఓటీటీ ప్రాజెక్టులు మా సంస్థ నుంచి వస్తాయి. 'ధమాకా' పక్కా మాస్‌ చిత్రం. రచయిత ప్రసన్న, దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ కథ చెప్పినప్పుడే మేం రవితేజకి అయితే బాగుంటుందని నమ్మాం. రవితేజలో ఎనర్జీని పూర్తిస్థాయిలో చూపిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. కథలో ఎవ్వరూ ఊహించని మలుపు ఉంది. మంచి వాణిజ్యాంశాలున్నాయి. అవే మమ్మల్ని ముందుకు నడిపించాయి. పాటలు, పోరాటాలు, కథలో మలుపులు... థియేటర్లలో ప్రేక్షకులు ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తున్నారు".
  • "కథానాయకుడు రవితేజతో ప్రయాణం చాలా బాగుంది. ఆయన మా సంస్థలో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుందని చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆయన చేతిలో పలు సినిమాలున్నా సరే, చాలా సౌకర్యంగా సినిమాని పూర్తి చేశాం. అంతగా సహకారం అందించారు. శ్రీలీల కూడా అంతే. ఈ సినిమా కోసం మేం మొదట సంప్రదించింది శ్రీలీలనే. ఆమె నటన, అందం, ప్రతిభ సినిమాకి ఆకర్షణగా నిలిచింది. రవితేజతో మళ్లీ కలిసి పని చేయడం కోసం కొన్ని ప్రాజెక్ట్‌లపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి".
  • "మా సంస్థ నుంచి తదుపరి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ప్రేక్షకుల ముందుకొస్తుంది. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. గోపీచంద్‌ - శ్రీవాస్‌ కలయికలో 'రామబాణం' సిద్ధమవుతోంది. లావణ్య త్రిపాఠితో మరో ప్రాజెక్ట్‌ ఉంది. కొన్ని పెద్ద చిత్రాలకి సంబంధించిన వివరాల్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం".
  • ఇవీ చదవండి:
  • Avatar 2 OTT Release : ఓటీటీలోకి అవతార్​ 2 అప్పుడే.. స్ట్రీమింగ్​ తేది అదే..?
  • బాలీవుడ్​లో విషాదం.. షూటింగ్ సెట్​లో టీవీ నటి ఆత్మహత్య

Last Updated : Dec 25, 2022, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.