ETV Bharat / entertainment

'కైకాల' సినిమాలకు దూరంగా ఉండటానికి కారణమిదే.. - కైకాల సత్యనారాయణ లేటెస్ట్​ న్యూస్​

వెండితెర వేదికగా ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ.. ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యారు. ఇదే విషయాన్ని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

kaikala satyanaryana
kaikala satyanaryana
author img

By

Published : Dec 23, 2022, 2:38 PM IST

'సిపాయి కూతురు'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ/ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతో అలరించిన ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాలను గతంలో ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో బయటపెట్టారు. అలా ఆయన సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

"పరిస్థితుల వల్ల సినిమాలకు దూరంగా ఉండక తప్పట్లేదు. నాటికీ నేటికీ స్క్రిప్టులు, పాత్రలు, నటీనటుల ప్రవర్తన, గౌరవ మర్యాదలు చూస్తే.. అంత సంతృప్తిగా అనిపించడం లేదు. కథ, కథనం, డైలాగులు, సంగీతం.. వంటి విషయాల్లో పొంతన లేదు. గతంలో పారితోషికం కూడా మాకు, హీరోలకు దాదాపు సమానంగానే ఉండేది. హీరో ఒక సినిమా చేసే లోపు.. మేము మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లం దానివల్ల పారితోషికం ఒకేలా ఉండేది.ఇప్పుడు హీరోలు పారితోషికం విపరీతంగా పెంచేస్తున్నారు. నాడు కళ కోసం చూసుకుంటే.. నేడు కాసుల కోసం చూసుకుంటున్నారు. ఇది నచ్చక.. నటనకు కాస్త దూరమయ్యాను. వరుస సినిమాల్లో చేస్తున్నప్పుడు నాలుగు రోజులు ఎక్కడికైనా పారిపోయి నిద్రపోవాలనుకునే వాడిని. ఇప్పుడు ఆ బాధ లేదు" అని సత్యనారాయణ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.