Indian Actor With Highest Oscar Nominations : ఓ నటుడికి ప్రశంసలతో పాటు అవార్డులు ప్రత్యేక గుర్తింపునిస్తుంటాయి. అది చిన్నదైనా, పెద్దదైనా సరే ఆ స్టార్స్ దాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ఇక ఆస్కార్ పురస్కారాలకు సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పేరుకు
ఇది హాలీవుడ్ ఇండస్ట్రీ అందజేస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ చిత్ర పరిశ్రమలు ఈ అవార్డును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. ఇక నటులు కూడా తమ లైఫ్‌లో ఒక్కసారైనా ఆ అవార్డును అందుకోవాలంటూ కలలు కంటుంటారు. నామినేషన్ వస్తే చాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు భారత్ నుంచి ఆస్కార్‌కు అత్యధిక సార్లు నామినేషన్ అయిన నటుడు ఒకరున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఆ యాక్టర్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు నామినేట్ అయ్యి సాధించి భారత్ నుంచి అత్యధిక సార్లు ఆస్కార్ రేసుకు ఎంపికైన నటుడిగా రికార్డుకెక్కారు. ఇంతకీ ఆయన ఎవంటే ?
Raghubir Yadav Career : బాలీవుడ్‌కు చెందిన రఘుబీర్ యాదవ్ 'న్యూటన్' చిత్రానికి గాను ఎనిమిదవ సారి ఆస్కార్ రేసులోకి ఎంపికయ్యారు. అప్పటి వరకు ఆయన గురించి అంతగా తెలియనివారు కూడా ఈ స్టార్ గురించి నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు. బుల్లితెరపై కనిపిస్తూ తన యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించిన రఘుబీర్ యాదవ్ ఆ తర్వాత క్రమంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'మాసే సాహిబ్' అనే హిందీ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన నటించిన 'సలామ్ బొంబాయి','రుడాలి','బండిత్ క్వీన్', '1947 ఎర్త్', 'లగాన్', 'వాటర్', 'పీప్లి లైవ్', 'న్యూటన్' ఇలా ఎనిమిది సినిమాలు ఆస్కార్ రేసులోకి నమోదయ్యాయి. వీటిలో సలామ్ బొంబాయి, లగాన్,వాటర్ చిత్రాలు ఫైనల్ ఫైవ్ నామినేషన్లకు కూడా అర్హత సాధించాయి. 'వాటర్' సినిమా మాత్రం కెనడా నుంచి నామినేట్ అవ్వగా, మిగిలిన ఏడు సినిమాలు మాత్రం భారత్ నుంచి అర్హత సాధించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Kamal Haasan Oscar Movies : మరోవైపు ఈ లిస్ట్‌లో రఘుబీర్ తరవాత అత్యధిక చిత్రాలు నామినేటైన స్టార్స్‌లో లోకనాయకుడు కమల్ హాసన్ సెకెండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన నటించిన ఏడు సినిమాలు ఆస్కార్ రేసులోకి ఎంపికయ్యాయి. 'సాగర్', 'స్వాతిముత్యం', నాయగన్','క్షత్రియ పుత్రుడు','ద్రోహి','భారతీయుడు', 'హేరామ్' చిత్రాలు ఆస్కార్ నామినేషన్‌కు అర్హత సాధించాయి.
మొన్న ఎన్టీఆర్‌కు ఇప్పుడు రామ్ చరణ్‌కు - ఆస్కార్ నుంచి అరుదైన గౌరవం
ఆస్కార్ రేసు నుంచి '2018' ఔట్- ఇన్‌స్టాలో డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!