ETV Bharat / entertainment

'కేజీయఫ్​ 3'పై అప్డేట్​.. రూ.3వేల కోట్ల బడ్జెట్​తో.. - కేజీయఫ్​ 2 తర్వాత యష్​

కేజీయఫ్​తో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హీరో యశ్​ అలా చేయడం తనకిష్టం లేదని చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు గురించి కూడా మాట్లాడారు. ఆ సంగతులు..

Kgf 3 updates
Kgf Yash
author img

By

Published : Dec 23, 2022, 6:50 PM IST

Updated : Dec 23, 2022, 7:25 PM IST

పాన్​ ఇండియా స్టార్ యశ్ నటించిన కేజీయఫ్‌​ చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టి ఈ ఏడాది గొప్ప విజయాన్ని సాధించింది. తాను ఇలా మరిన్ని విజయాలు సాధిస్తానని.. ఆ ప్రయత్నంలో చనిపోయినా ఫర్వాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నన్ను ఎగ్జైట్​ చేసేపని కోసం తాను ఎంత వరకైనా పోరాడతానని అన్నారు.

"కేజీఎఫ్​ లాంటి సక్సెస్​ తర్వాత మీరు ఏం చేస్తారని చాలా మంది నన్ను అడుగారు. మీరు ఏమి అనుకుంటున్నారని తిరిగి అడిగాను. అప్పుడు వాళ్లు బహుశా.. కేజీయఫ్‌ విజయమే మీ అంతిమ విజయము కావొచ్చు సమాధానమిచ్చారు. కానీ, నాకు సక్సెస్​ వచ్చిందని.. ఇదే అంతిమం అని విశ్రాంతి తీసుకునే వ్యక్తిని కాదు. నాకు ఉత్సాహాన్ని కలిగించే దాని కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాను. బయటకు వెళ్లి నా గురించి ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రాజు తనే రాజు అని చెప్పుకుంటే అతడు రాజు కాలేడు. అలా తమ జీవితంలో విజయం సాధించి గొప్పగా రాణిస్తున్న వారెవరైనా సరే బయటకు వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మని విజయాన్ని ప్రజలే గుర్తిస్తారు" అని యశ్​ చెప్పుకొచ్చారు.

నార్త్​, సౌత్​.. వేరు చేయడం మర్చిపోవాలి.. కన్నడ పరిశ్రమలో ఉన్న నటీనటులందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్​ తెలిపారు. అందరినీ గౌరవించాలిని.. అలానే బాలీవుడ్‌ని కూడా గౌరవించాలని పిలుపునిచ్చారు. అసలు ఉత్తరాది సినిమాలు, దక్షిణాది సినిమాలు అనే తేడాను మర్చిపోవాలన్నారు. బాలీవుడ్‌ను తక్కువ చేసి చూడడం మంచి పరిణామం కాదు, మనమంతా ఒకే దేశం.. మనందరం కలిసి మంచి సినిమాలు తీయాలని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి; థియేటర్లను నిర్మించుకోవాలి ఇలా చెబుతూ పోతే చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. గొడవలు మానేసి ప్రపంచ దేశాలతో పోటీపడి ఇదీ భారతదేశం అని గర్వంగా చెప్పాలి అని యశ్‌ అన్నారు.

'సలార్‌' తర్వాత కేజీయఫ్‌​-3.. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్‌. దీనికి సీక్వెల్​గా ఈ ఏడాది కేజీయఫ్‌ చాప్టర్‌-2 వచ్చింది. అది కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో కేజీయఫ్‌-3 ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపైనా హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌‌ స్పష్టత ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో రూ.3వేల కోట్ల మేర భారత వినోద పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. మున్ముందు వినోద పరిశ్రమ మరింత వృద్ధి చెందబోతోంది. ఏటా కనీసం ఐదారు చిత్రాలు మా బ్యానర్‌ కింద నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఒక హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతోంది. ఇక 'సలార్‌' పూర్తయ్యాక ‘కేజీయఫ్‌-3’పై నీల్‌ దృష్టి పెట్టనున్నారని విజయ్‌ కిరంగదూర్‌ చెప్పారు. సలార్‌ పూర్తయ్యక.. కేజీయఫ్‌-3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్‌ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్‌ ఉందని, వచ్చే ఏడాది గానీ, ఆ మరుసటి ఏడాదిగానీ సాకారం కావొచ్చని చెప్పారు.

Last Updated : Dec 23, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.