ETV Bharat / entertainment

IFFM Awards 2023 : ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్​ ఠాకూర్​కు 'డైవర్సిటీ' అవార్డ్​ - మృణాల్ ఠాకూర్​ సీతారామం అవార్డు

IFFM Awards 2023 Sita Ramam : మృణాల్​ ఠాకూర్​, దుల్కర్​ సల్మాన్​ జంటగా నటించిన సినిమా 'సీతారామం' మరో ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ మెల్​బోర్న్- ఐఎఫ్​ఎఫ్​ఎమ్​​ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటీనటులుగా రాణి ముఖర్జి, విజయ్​ వర్మ, మోహిత్ అగర్వాల్​ నిలిచారు. మృణాల్​ ఠాకూర్​ డైవర్సిటీ ఇన్​ సినిమా అవార్డు అందుకున్నారు

IFFM Awards 2023
IFFM Awards 2023
author img

By

Published : Aug 11, 2023, 7:45 PM IST

Updated : Aug 11, 2023, 8:20 PM IST

IFFM Awards 2023 Sita Ramam : సాధారణ సినిమాగా విడుదలైన 'సీతారామం'.. ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించింది. ఈ మధుర ప్రేమ కావ్యం సినీ అభిమానులను అలరించి దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. పలు అవార్డులు సైతం అందుకుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన ప్రతి మాట.. పలికించిన ప్రతి భావాన్నీ ప్రేక్షకులు ఆస్వాదించారు. అప్పట్లో తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చాటుకుంటున్నారు కూడా. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్​ డ్రామాను మరో అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ మెల్​బోర్న్- ఐఎఫ్​ఎఫ్​ఎమ్​​ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

దీంతో పాటు 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాకు గానూ బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ రాణి ముఖర్జి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 'ఆగ్రా' చిత్ర నటుడు మోహిత్ అగర్వాల్​ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ ఇండీ చిత్రంగా 'ఆగ్రా', ఉత్తమ దర్శకుడిగా పృథ్వీ కొననూర్​ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు వివిధ కేటగిరిల్లో పలు వెబ్​సిరీస్​లకు కూడా అవార్డులు ప్రధానం చేశారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరణ్​ జోహార్​ను సత్కరించారు. ఇక నటుడు కార్తిక్ ఆర్యన్​కు రైజింగ్​ గ్లోబల్​ సూపర్​ స్టార్ ఆఫ్​ ది ఇండియన్ సినిమా ట్రోఫీని అందించారు.

ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ మెల్​బోర్న్అవార్డ్స్​ - 2023
సినిమా కేటగిరి :

  • ఉత్తమ చిత్రం - సీతారామం
  • ఉత్తమ నటి - రాణి ముఖర్జి (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
  • ఉత్తమ నటుడు - మోహిత్ అగర్వాల్ (ఆగ్రా)
  • ఉత్తమ ఇండీ ఫిల్మ్​ - ఆగ్రా
  • ఉత్తమ దర్శకుడు - పృథ్వీ కొననూర్

గౌరవ పురస్కారాలు :

  • ఈక్వాలిటీ ఇన్​ సినిమా అవార్డు - డార్లింగ్స్​ (నెట్​ఫ్లిక్స్​ సినిమా)
  • పీపుల్స్​ ఛాయిస్​ అవార్డు - పఠాన్
  • డైవర్సిటీ ఇన్​ సినిమా అవార్డు - మృణాల్ ఠాకూర్​ (సీతారామం)

వెబ్​సిరీస్​ కేటగిరి :

  • ఉత్తమ సిరీస్​ - జుబిలీ
  • ఉత్తమ నటుడు - విజయ్ వర్మ (దహాద్)
  • ఉత్తమ నటి - రాజశ్రీ దేశ్​పాండే (ట్రయల్ బై ఫైర్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ - టు కిల్ ఎ టైగర్
  • డిస్రప్టర్​ అవార్డు - భూమి పెడ్నేకర్
  • రెయిన్​బో స్టోరీస్ అవార్డు - ఒనిర్​ (పైన్​ కోన్)

SIIMA 2023 Nominations : 'సీతారామం'కు 10 నామినేషన్లు.. మరి RRR?

Mrunal Thakur : పైపైకి ఎగబాకుతున్న మృణాల్ ఠాకూర్!

Last Updated : Aug 11, 2023, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.