ETV Bharat / entertainment

Krrish 4 Shooting : 'క్రిష్​-4' కథకు హృతిక్ గ్రీన్​ సిగ్నల్!.. త్వరలో సెట్స్​పైకి సూపర్​ హీరో మూవీ! - క్రిష్​ 4 సినిమా స్క్రిప్ట్

Krrish 4 Shooting : బాలీవుడ్ హీరో హృతిక్​ రోషన్​ లీడ్​ రోల్​లో మరో భారీ ప్రాజెక్ట్ సినిమా​ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్నేళ్లుగా ఫ్యాన్స్​ ఎదురుచూసిన సూపర్​ హీరో మూవీ 'క్రిష్​ 4'కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్​ తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..

Krrish 4
Krrish 4
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 5:50 PM IST

Krrish 4 Shooting : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'క్రిష్'​ సిరీస్​కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. 'కోయీ మిల్​ గయా' అనే సినిమాతో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సిరీస్​.. ఆ తర్వాత 'క్రిష్​ 2', 'క్రిష్​ 3' చిత్రాలతో ఓ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇందులో హృతిక్​తో పాటు కంగనా రనౌత్​, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్​ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అయితే 2013లో 'క్రిష్​ 3' విడుదలైన తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్​ ఉంటుందని మేకర్స్​ ప్రకటించారు. దీంతో అభిమానులు రానున్న ప్రాజెక్ట్​ గురించి ఎంతగానో ఎదురుచూశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్​ పట్టాలెక్కలేదు. దీంతో ఫ్యాన్స్​కు నిరాశే ఎదురైంది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్టేట్​​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాను తెరకెక్కించే పనుల్లో హృతిక్​ బిజీ అయిపోయారట. తన తండ్రి రాకేశ్​ రోషన్ రాసిన స్క్రిప్ట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఆ కథను హృతిక్​ సమీక్షించి, కొన్ని మార్పులను చేశారట. ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్​ చేస్తున్నారట. ఇందులో భాగంగా తన పాత్ర కోసం పూర్తి ఫిట్‌గా అయ్యేందుకు హృతిక్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు షూటింగ్ లోకేషన్​ గురించి కూడా మూవీ టీమ్​ రీసెర్చ్ చేస్తోందట. అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో భాగంగా పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు సింగపూర్​ను ఎంచుకున్నారని టాక్ . అయితే బడ్జెట్​కు అనుగుణంగానే లోకేషన్ల ఎంపిక జరగనుందని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో ఫీమేల్​ లీడ్​ కోసం ప్రియాంక చోప్రాను మూవీ మేకర్స్​ సంప్రదించనున్నారని సనీ వర్గాల టాక్​.

Krrish 4 Story Line : ఇక అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టోరీ లైన్​ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. అంతరిక్ష నేపథ్యం, టైమ్‌ ట్రావెల్ స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను టైం ట్రావెల్‌ సహాయంతో వెనక్కి తీసుకురావడమే (బ్రింగ్‌ బ్యాక్‌ రోహిత్‌ మెహ్రా) ప్రధానాంశంగా క్రిష్‌-4 కథనం ఉంటుందని.. 'జాదు'కి కూడా కీలకపాత్ర ఉంటుందని టాక్​ వినిపించింది. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, ప్రధాన పాత్రను హృతిక్‌ పోషించగా, సౌత్‌ ఇండస్ట్రీ నుంచి మరో పెద్ద హీరోని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా కథ సిద్ధం చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏదేమైనా 'క్రిష్‌-4'ను అత్యాధునిక సూపర్‌ హీరో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాగా రూపొందించనున్నారట.

నాలుగో 'క్రిష్'​ కోసం నాలుగు పాత్రల్లో హృతిక్​!

హృతిక్​ రోషన్​కు విలన్​గా దక్షిణాది నటుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.