ETV Bharat / entertainment

How To Watch ETV Win For Free : ఈటీవీ విన్ బంపర్ ఆఫర్​.. వీకెండ్​లో ఫ్రీగా సినిమాలు, షోస్ స్ట్రీమింగ్ - ఈటీవీ విన్​ సినిమాలు

How To Watch ETV Win For Free : తెలుగు ప్రేక్షకులకు ఈటీవీ ఛానల్​ గుడ్​న్యూస్ చెప్పింది. ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 26, 27వ తేదీల్లో వీక్షకులకు ఉచితంగా డిజిటల్ ప్లాట్​ఫామ్​ ఈటీవీ విన్​ యాప్​ను యాక్సిస్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఆ రెండు రోజులు ఉచితంగా ఈటీవీ విన్​లో ఉన్న కంటెంట్​ను చూడవచ్చని పేర్కొంది.

How To Watch ETV Win For Free
How To Watch ETV Win For Free
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 6:59 PM IST

Updated : Aug 24, 2023, 7:23 PM IST

How To Watch ETV Win For Free : తెలుగువారి అభిమాన ఎంటర్​టైన్​మెంట్ ఛానల్​ ఈటీవీ.. 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు గుడ్​న్యూస్ చెప్పింది. ఈటీవీకి చెందిన అన్ని ఛానళ్లను, అలనాటి మేటి చిత్రాల నుంచి సరికొత్త కంటెంట్​ ఉన్న సినిమాలు, రియాల్టీ షోలను ఒకే చోటకు చేర్చిన.. డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ఈటీవీ విన్‌ యాప్​ను ఆగస్టు 26, 27 వ తేదీల్లో ఫ్రీగా యాక్సెస్ చేసుకునే వీలు కల్పించింది. ఇప్పటివరకు కేవలం టీవీలకే పరిమితమైన వినోదభరిత కార్యక్రమాలను ఇక మీ మొబైల్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా ఈటీవీ విన్‌ ఓటీటీ వేదిక ద్వారా వీక్షించవచ్చు.

ఈటీవీ 28వ వసంతోత్సవం (ఆగస్టు 27) వేళ ప్రేక్షకులకు మెగా కానుక లభించినట్లైంది. ఈ వారాంతపు కంటెంట్​లో హాస్యనటుడు బ్రహ్మానందం సరికొత్త పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించిన 'పంచతంత్రం', యువ నటుడు చైతన్య కృష్ణ హీరోగా నటించిన 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'ను కూడా వీక్షించవచ్చు. 'పోలీస్ స్టోరీ', 'కనులు తెరిచినా కనులు మూసినా' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన విభిన్న ఆకర్షిణీయమైన చిత్రాలను ఈటీవీ విన్​లో చూడవచ్చు. అలాగే ఈటీవీ విన్​లో ఈటీవీ సీరియల్స్, రియాల్టీ షోలు కూడా చూడవచ్చు.

ఈటీవీ సినిమా ప్రేక్షకులకు తరగని గది. వీక్షకుల సౌలభ్యాన్ని గుర్తిస్తూ ఈటీవీ విన్ 10 గంటల క్యాచ్ అప్​ ఫీచర్ కంటెంట్​ను అందిస్తుంది. టెలివిజన్‌లో ప్రసారం చేయడానికి ముందు ప్రేక్షకులు తమకు ఇష్టమైన షోలను విన్​లో వీక్షించే వీలుంది. ఈ ప్లాట్‌ఫామ్​లో లైవ్​లో కార్యక్రమాల అనుభూతిని పొందవచ్చు.

how to watch etv win for free
ఈటీవీ విన్​ బంపర్ ఆఫర్

ఉదయ్​ కిరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం, తరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'నువ్వే కావాలి', ఆనందం వంటి మరపురాని చిత్రాలు ఈటీవీ విన్ లైబ్రరీ సొంతం. ఈ నెల 26, 27 తేదీల్లో ఈటీవీ విన్​లో వారాంతపు వినోదాల విందును ప్రేక్షకులు ఉచితంగా ఆస్వాదించవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఈటీవీ విన్​యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని మీ అభిమాన సినిమాలు, సీరియల్స్​, షోలను చూసేయండి.

ETV Win Subscription Price : 40వేల గంటలకుపైగా ఉన్న ఈటీవీ కార్యక్రమాల భాండాగారంలో ఏదైనా.. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదిక ద్వారా కేవలం రోజుకు ఒక్క రూపాయి ఖర్చుతో చూడవచ్చు. సంవత్సరానికి 365 రూపాయలు కనీస మొత్తం చెల్లించి.. ఈటీవీ విన్‌ మొబైల్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మొబైల్‌తో పాటు టీవీలోనూ చూడాలనుకుంటే ప్రీమియం ప్లాన్‌లో ఏడాదికి కేవలం 499 రూపాయలు చెల్లిస్తే చాలు.. అనంతమైన వినోదం మీ సొంతం.

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు

ఈటీవీ ఇక మీ అర చేతిలో... 'ఈటీవీ విన్​'

Last Updated : Aug 24, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.