Alia Ranbir Remuneration: దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ ఎట్టకేలకు ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. దీంతో అటు అభిమానుల్లో ఇటు బాలీవుడ్ చిత్రసీమలో కొత్త ఉత్సాహం నెలకొంది. మీడియాలో ప్రస్తుతం వీరి పెళ్లే హాట్ టాపిక్. ఇక ఈ జంట హనీమూన్ కోసం దక్షిణాఫ్రికా వెళ్తున్నారని తెలిసింది. త్వరలోనే తిరిగి వచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటారట! అయితే ఈ నేపథ్యంలో వీరి రెమ్యూనరేషన్ విషయం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆలియా ఒక్కో సినిమాకు రూ.15కోట్లు తీసుకుంటుందని, ఇక రణ్‌బీర్ విషయానికొస్తే.. ఒక్కో చిత్రానికి రూ.60 నుంచి రూ.70కోట్లు తీసుకుంటారని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రణ్‌బీర్-ఆలియా సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరి కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే తొలి భాగం చిత్రీకరణ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో పాటే రణ్‌బీర్.. సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటిస్తుండగా.. ఆలియా 'డార్లింగ్స్', 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని' చిత్రాల్లో నటిస్తోంది.
ఇవీ చదవండి: పాన్ ఇండియా హీరోగా నిఖిల్.. రామ్ కోసం శింబు.. ఓటీటీలో 'గని'