సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్ 'సలార్' ఒకటి. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాన్‌ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఓ మీడియా సంస్థతో చిత్ర క్లైమాక్స్ గురించి మాట్లాడిండట. ఈ సినిమా పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, కచ్చితంగా ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తాయని చెప్పనట్లు తెలిసింది.కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటుంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇటీవలే విడుదలైన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన 'కాంతార' బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాయి. వాటిని చూసిన సినీప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడా సీన్స్ మించేలా సలార్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఇదీ చూడండి: Tollywood: ఆ సినిమాలపై వాణిజ్య మండలి కీలక నిర్ణయం