ETV Bharat / entertainment

ఏంటీ.. 'దసరా' కన్నా 'ఆదిపురుష్'కు తక్కువా?

Adipurush overseas : 'ఆదిపురుష్​' ఓవర్సీస్ బుకింగ్స్ గురించి ఓ షాకింగ్ వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. ఆ వివరాలు..

Adipurush
ఏంటీ.. 'దసరా' కన్నా 'ఆదిపురుష్'కు తక్కువా?
author img

By

Published : Jun 6, 2023, 3:39 PM IST

Adipurush overseas Market : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన 'ఆదిపురుష్' మూవీ.. జూన్ 16వ తేదీన విడుదల కానుంది. దీంతో మూవీటీమ్​ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. అలాగే సినిమా బిజినెస్​కు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా జరుపుకుంటోంది. ఓవర్సీస్​లోనూ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్​ ఓపెన్ అయిపోయాయి. దీంతో ఇక్కడితో పాటు వరల్డ్​వైడ్​గా ఆదిపురుష్ సందడే కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు విజువల్ వండర్​గా రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ బుకింగ్స్ గురించి ఓ షాకింగ్ వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. యూఎస్​ఏలో ఈ చిత్రంపై హాలీవుడ్ సినిమా 'ది ఫ్లాష్' ప్రభావం గట్టిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రం కూడా జూన్ 16నే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫలితంగా 'ఆదిపురుష్'కు చిత్రానికి చాలా తక్కువ లొకేషన్లే దొరికినట్లు సమాచారం అందింది.

అసలీ ఈ ఆదిపురుష్​పై 'ది ఫ్లాష్' మూవీ ఎఫెక్ట్ ఏమాత్రం ఉందనే దానికి ఓ ఊదాహరణను కూడా చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. కొద్ది రోజుల క్రితం విడుదలై మంచి టాక్​ తెచ్చుకున్న నాని 'దసరా'.. రిలీజ్​కు పది రోజుల ముందు 200 లొకేషన్స్​లో బుకింగ్స్​ ఓపెన్ అయ్యాయి. కానీ 'ఆదిపురుష్' చిత్రానికి మాత్రం.. సరిగ్గా పది రోజుల సమయం ఉండగా.. కేవలం 130 లొకేషన్లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. 'ఫ్లాష్' మూవీ​ ప్రభావం వల్ల ఓవర్సీస్​లో 'ఆదిపురుష్'​ కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Adipurush
ఆదిపురుష్​ ఓవర్సీస్ బుకింగ్స్​

Adipurush movie Budget : ఆదిపురుష్ సినిమాను టీసిరీస్​ సంస్థ రూ.550కోట్ల బడ్జెట్​ పెట్టి నిర్మించిందని అని సమాచారం. అయితే ఈ చిత్ర శాటిలైట్​ డిజిటల్​ రైట్స్​ అన్ని భాషల్లో కలిపి రూ.250కోట్లకు అమ్ముడపోయాయట. మ్యూజిక్​ రైట్స్​ ప్రొడ్యూసర్స్​ దగ్గరే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో థియేట్రికల్​ రైట్స్​ రూ.185కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. ఓవర్సీస్​, హిందీతో పాటు ఇతర భాషల్లో నిర్మాణ సంస్థే లోకల్​ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఓన్​ రిలీజ్​ చేస్తుంది. సినిమా బాగుంటే తొలి వారంలోనే మంచి ఫ్రాఫిట్​ను అందుకుంటుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన కృతి సనన్‌ జానకిగా కనిపించనుంది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే నటించారు. ఈ సినిమా(#Adipurush pre release event) ప్రీ రిలీజ్ ఈవెంట్​ మరి కాపెట్లో(మే 26)న తిరుపతిలో గ్రాండ్​గా జరగనుంది.

ఇదీ చూడండి :

50అడుగుల ప్రభాస్​ హోలోగ్రామ్​​.. అయోధ్య సెట్​.. ఆదిపురుష్​ ప్రీరిలీజ్​ ఈవెంట్ ప్లాన్​​ కేక​!

సోషల్​మీడియా అంతా 'ఆదిపురుష్' మయం.. అభిమానుల సందడే సందడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.