ETV Bharat / entertainment

Hit 2: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్‌ .. లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన అడవి శేష్‌!

author img

By

Published : Nov 8, 2022, 10:16 PM IST

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్ 2' నుంచి 'ఉరికే ఉరికే..' రొమాంటిక్​ సాంగ్​ ప్రోమోను మేకర్స్​ రిలీజ్​ చేశారు. అయితే ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

hit-2-urike-urike-promo-song-out
hit-2-urike-urike-promo-song-out

Hit 2 New Song: అడివి శేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హిట్ 2'. ఈ చిత్రంలో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన 'హిట్ ది ఫస్ట్ కేస్' చిత్రానికి ఇది సీక్వెల్​గా రూపొందుతోంది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్‌లో విడుదలవ్వనుంది.

గత వారం విడుదలైన 'హిట్ 2' టీజర్‌కు టెరిఫిక్ రెస్పాన్ష్ వచ్చింది. ఇప్పుడు 'ఉరికే ఉరికే..' అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ను అలరించబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్.. మ్యాజిక్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎమ్​ఎమ్​ శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. సిద్​ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతుతో ఈ పాట పాడారు. పూర్తి సాంగ్‌ నవంబరు 10న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.