Hi Nanna Trailer Launch : సినిమా తనకు ఆక్సిజన్‌లాంటిదని నేచురల్ నాని అన్నారు. ఫలితాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు. నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' పాన్ ఇండియా లెవెల్లో డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని పాల్గొన్నారు. ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన.. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
"హాయ్ నాన్న లో నా లుక్ బాగుంటుంది. నాకు నేనే బాగా నచ్చాను. ఇన్నేళ్లలో ఏ సినిమాకు కూడా నాకు ఇలా అనిపించలేదు. పాటలు, టీజర్, ట్రైలర్లలో లేనిది, మీరు ఊహించనిది ఈ సినిమాలో చాలా ఉంది. ఈ సినిమా నాకు ఆక్సిజన్‌తో సమానం. ఊపిరిపై ఒట్టేసి చెబుతున్నాను.. ఈ సినిమాతో మీరంతా ప్రేమలో పడతారు" అని ధీమా వ్యక్తం చేశారు. అయితే షూటింగ్లో భాగంగా ఆయన కంటికి గాయమైందని, అందుకే కళ్లజోడు పెట్టుకున్నానని తెలిపారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు.
- ఈ ట్రైలర్ చూస్తే 'జెర్సీ' సినిమా ఎమోషన్ కనిపిస్తోంది. రెండింటికీ తేడా ఏంటి?
నాని: 'జెర్సీ'లో కొడుకు. 'హాయ్ నాన్న'లో కూతురు. కొడుకు ఎమోషన్‌కు, కూతురు ఎమోషన్‌కు ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! 'జెర్సీ' ఎలాగైతే మీ హృదయాలను హత్తుకుందో 'హాయ్ నాన్న' సినిమా కూడా అలానే హత్తుకుంటుంది. - ఈ సినిమా విషయంలో, మీ కొడుకు విషయంలో బెస్ట్ మూమెంట్?
నాని: ఔట్‌పుట్ కూడా బాగా వచ్చింది. సినిమాపై నమ్మకంగానే ఉన్నాం. డిసెంబరు 7 ఉదయమే నాకు బెస్ట్ మూమెంట్ కానుంది. నా కొడుకు విషయానికొస్తే.. 'నీ ఫేవరెట్ హీరో ఎవరు?' అని అడిగితే నువ్వే నాన్న అని సమాధానమిచ్చాడు. రియల్ లైఫ్‌లో అదే నాకు బెస్ట్ మూమెంట్. - మీరు ఈ కథను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
నాని: మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో కథను ఓకే చేశాను. - 'అంటే.. సుందరానికీ!' రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని 'హాయ్ నాన్న' విషయంలో ఏమైనా సందేహించారా?
నాని: ఫలితాలతో నాకు సంబంధంలేదు. నాకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోతాను.- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హాయ్ నాన్న' కోసం సోలో ప్రమోషన్స్ - నాని ఆ సక్సెస్ ఫార్ములాను వాడుతున్నారా ?
Kiara Khanna Hi Nanna Movie : ముద్దు ముద్దు మాటల కియారా.. 'హాయ్ నాన్న' చిన్నారి ఎవరో మీకు తెలుసా?