ETV Bharat / entertainment

'రోజుకు ఏడుసార్లు తిని అలా అయ్యా.. ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డాం' - నాటు నాటు పాటపై హీరో రామ్​​ చరణ్​ తారక్ ఇంటర్వ్యూ

నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్​ పురస్కారం వచ్చిన నేపథ్యంలో అందులో నటించిన హీరోలు రామ్​ చరణ్​, జూ.ఎన్టీఆర్​లను ఇంటర్వ్యూ చేసేందుకు అక్కడి వార్తా సంస్థలు పోటీపడుతున్నాయి. వీరు ప్రముఖ మ్యాగజైన్​ వెరైటీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్​ విషయాలను పంచుకున్నారు. అవేంటంటే..

Ram Charan NTR Interview In Hollywood
Ram Charan NTR Interview
author img

By

Published : Jan 14, 2023, 3:12 PM IST

ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా పురస్కార ప్రదానోత్సవం కోసం అమెరికా లాస్‌ ఏంజిల్స్​కు వెళ్లిన రామ్​ చరణ్, ఎన్టీఆర్​లు అక్కడ ఓ ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ వెరైటీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను అమెరికన్లతో పంచుకున్నారు. ఇక సినిమాలో పులితో జరిగిన ఫైట్‌ సీన్స్​ను ఉద్దేశిస్తూ.. నిజంగా పులితో ఫైట్‌ చేయాల్సి వస్తే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సేపు తలపడతారు? అని యాంకర్​ అడగ్గా.. అదే నిజంగా జరిగితే మేమిద్దరం ముందే అక్కడి నుంచి పారిపోతాం అంటూ తారక్‌ నవ్వులు పూయించారు. అనంతరం రామ్​ చరణ్​తో స్నేహ బంధంతోపాటు సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ హీరోలిద్దరూ బయటపెట్టారు.

గర్వంగా ఫీలవుతున్నాం: జూ. ఎన్టీఆర్​
గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకల్లో భాగంగా మేము ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాధారణంగా కుటుంబంతో కలిసి అమెరికాకు హాలిడే ట్రిప్​కు వస్తుంటాం. కానీ, ఈ సారి ప్రత్యేకంగా సినిమా కోసం రావడం థ్రిల్లింగ్​గా ఉంది. భారతీయులుగా ఈరోజు ఇంతటి ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగానూ ఉంది.

ఇప్పటికీ కలగానే ఉంది: రామ్​ చరణ్‌
లాస్‌ ఏంజిల్స్‌ స్టూడియోలో ఉన్నానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్కటవుతోంది. అదే విధంగా భాషా పరమైన వ్యత్యాసాలు లేకుండా సినిమా అనేది ఒకే తాటి మీదకు వస్తోంది. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్నారు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు.

తారక్‌ ఎంతో కష్టపడ్డాడు: రామ్​ చరణ్‌
క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ భుజాల మీద నేను కూర్చొని ఫైట్స్‌ చేస్తుంటాను. ఆ సీన్​ మా ఇద్దరికీ ఎంతో కష్టంగా అనిపించింది. ముఖ్యంగా తారక్‌ ఆ సీక్వెన్స్​ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాడు. నన్ను తన భుజాలపై మోశాడు. సుమారు 15 రాత్రులపాటు ఆ సీన్స్‌ని షూట్‌ చేశాం.

రోజుకి 7 సార్లు.. అలా ఏడాదిన్నర: జూ.ఎన్టీఆర్
ఈ సినిమా కోసం ఫిట్‌నెస్‌ పరంగా మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని నెలలు ఒకే తరహా శరీరాకృతిని మెయిన్‌టెయిన్‌ చేశాం. నా డైట్‌ విషయానికి వస్తే ఒక రోజులో సుమారు 3000 కేలరీలు పెంచుకోవాల్సి వచ్చింది. దీని కోసం ఒకరోజులో ఏడు సార్లు భోజనం చేశాను. అనుకున్న లుక్​ రావడానికి 16 నుంచి 17 నెలల సమయం పట్టింది.

చరణ్‌ ఓ సముద్రం: జూ. ఎన్టీఆర్
నా దృష్టిలో చరణ్‌ నీరు లాంటివాడు. అతడిని నేను సముద్రంతో పోలుస్తా. మరింత లోతుగా వెళ్లి, అతడితో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడే చరణ్‌ గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి.

ఆ సీన్​ కోసం 12 రోజులు: జూ. ఎన్టీఆర్
బ్రిడ్జ్‌ కూలేటప్పుడు బాలుడిని కాపాడిన ఆ సీన్స్​ను 2018లోనే షూట్‌ చేశాం. షూటింగ్‌ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఎంతో సరదాగా గడిచిపోయింది. మూడో రోజు నుంచి ఈ సీక్వెన్స్‌ మొదలుపెట్టి.. 12 రోజులపాటు షూట్‌ చేశాం.

దాని గురించి నేను మాట్లాడను: జూ. ఎన్టీఆర్
భారత్‌ తరఫున ఏ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపించాలనే విషయంలో రాజకీయాలు జరిగాయని నేను చెప్పను. ఏ చిత్రాన్ని ప్రతిపాదించాలనే విషయం ప్యానెల్‌లోని సభ్యులకు తెలుసు. వాళ్లు ఎప్పుడూ ఉన్నతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తారు. కాబట్టి, ఆర్‌ఆర్‌ఆర్‌ను దేశం తరఫున అధికారికంగా ఎందుకు ఎంపిక చేయలేదని అడగను. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికే మమ్మల్ని తలెత్తుకునేలా చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.