ETV Bharat / entertainment

హీరో చియాన్​ విక్రమ్​కు అస్వస్థత

author img

By

Published : Jul 8, 2022, 3:01 PM IST

Updated : Jul 8, 2022, 6:40 PM IST

Hero Vikram Heart Attack
హీరో విక్రమ్​కు గుండెపోటు

15:00 July 08

హీరో చియాన్​ విక్రమ్​కు అస్వస్థత

Hero Chiyan Vikram: ప్రముఖ నటుడు చియాన్​ విక్రమ్​కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్​కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు విక్రమ్​ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు కావేరి ఆస్పత్రి సహవ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్.

ఆ వార్తలన్నీ అసత్యం!: విక్రమ్​ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. "విక్రమ్​కు ఛాతిలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవం. ఈ వదంతులు వినడం చాలా బాధ కలిగించింది. విక్రమ్ బాగున్నారు. ఒక రోజులో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది" అని అన్నారు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్.

మరోవైపు... విక్రమ్​ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. విక్రమ్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.'అపరిచితుడు' చిత్రంతో విక్రమ్‌ తెలుగువారికి ఎంతో చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలై ఇక్కడి వారిని అలరించాయి. ప్రస్తుతం ఆయన 'కోబ్రా', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​లో అడివిశేష్​ 'మేజర్​' రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం

Last Updated : Jul 8, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.