ETV Bharat / entertainment

'జెర్సీ' డైరెక్టర్​కు రౌడీ హీరో గ్రీన్​ సిగ్నల్​!.. మరి చరణ్​తో సినిమా పరిస్థితేంటి? - vijay devarakonda jersey director

Vijay Devarakonda Next Film: హీరో విజయ్​ దేవరకొండ తదుపరి మూవీ ఖరారైనట్లు తెలిసింది. 'జెర్సీ' డైరెక్టర్​ గౌతమ్​ దర్శకత్వంలో ఆయన​ సినిమా చేయనున్నారట. ఆ వివరాలు..

Vijay Devarakonda Next Film
Vijay Devarakonda Next Film
author img

By

Published : Oct 20, 2022, 12:43 PM IST

Updated : Oct 20, 2022, 12:54 PM IST

Vijay Devarakonda Next Film: 'మళ్ళీ రావా', 'జెర్సీ' చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు గౌతమ్ తిన్ననూరి. 'జెర్సీ' తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్​తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమాలో మధ్యలో ఆగడంతో గౌతమ్​.. ఇప్పుడు కొత్త సినిమాపై దృష్టి పెట్టారు.

రామ్​చరణ్​తో సినిమా ఆగిన తర్వాత ఆయన విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చారని టాలీవుడ్ టాక్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్​రాజు మంచి ఎంటర్‌టైనర్​ను నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.

అయితే విజయ్ ఎన్నో ఆశలతో చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. వసూళ్ల సంగతి పక్కన పెడితే.. రౌడీ బాయ్స్, ఫ్యాన్స్‌కు కూడా సినిమా నచ్చలేదు. ఆ రిజల్ట్ విజయ్ దేవరకొండ మీద చాలా ఎఫెక్ట్ చూపించిందని, దాని నుంచి కోలుకోవడం కోసం కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారట. 'లైగర్' ఫ్లాప్ తర్వాత తాను చేయబోయే సినిమాల కథలో విషయంలో విజయ్ దేవరకొండ మరింత జాగ్రత్త వహిస్తున్నారు. అయితే 'లైగర్' విడుదల కాక ముందే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన 'జనగణమణ' సినిమాను పక్కన పెట్టేశారు.

ఇవీ చదవండి: ఆ హిందీ మూవీ​ సీక్వెల్​లో 'సీతారామం' బ్యూటీ!.. నిజమేనా?

ఇన్​స్టాలో కాజల్​ అగర్వాల్​ పోస్ట్​.. ఆరు లక్షల లైక్స్​.. మీరు చూశారా?

Last Updated : Oct 20, 2022, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.