తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి ఊహ ఆందోళనకు గురైంది. ఆ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పుష్ప-2' నుంచి సూపర్ అప్డేట్!.. లేడీ విలన్‌గా 'సరైనోడు MLA'?