ETV Bharat / entertainment

త్వరలోనే రామ్​ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

author img

By

Published : Jun 26, 2022, 8:42 PM IST

Ram potineni Marriage: టాలీవుడ్ కథానాయకుడు రామ్​ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం సాగుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

ram potineni marriage
రామ్​పోతినేని పెళ్లి

Ram potineni Marriage: టాలీవుడ్​ బ్యాచిలర్స్​రో ఒకరైన హీరో రామ్​పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్​మేట్​ను వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట.

త్వరలోనే పెళ్లి పనులు మొదలుపెట్టేందుకు రామ్​ సన్నద్ధమవుతున్నారని, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో నిశ్చితార్థం, నవంబరులో పెళ్లి జరగొచ్చని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే హీరో స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఇస్మార్ట్​ శంకర్'​తో సూపర్​ సక్సెస్​ను అందుకున్న రామ్​.. ఆ తర్వాత నుంచి దూకుడు కొనసాగిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన నటించిన 'ది వారియర్'​ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు ఆయన ఊరమాస్​ డైరెక్టర్​ బోయపాటితో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం.

ఇదీ చూడండి: 'చోర్​బజార్'​.. ఆ నమ్మకాన్ని ఇచ్చింది: ఆకాశ్​ పూరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.