ETV Bharat / entertainment

Nikhil Spy movie : 'స్పై' రేంజ్.. వరల్డ్ వైడ్​ ఎన్ని థియేటర్స్​లో​ తెలుసా? - నిఖిల్ స్పై ప్రీ రిలీజ్ బిజినెస్​

Nikhil siddharth spy movie : నిఖిల్ 'స్పై' చిత్రం ఇంకో రోజులో(జూన్​ 29) రిలీజ్​ కానుంది. మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్​ కానుందో తెలుసా?

nikhil spy theatres
నిఖిల్ స్పై థియేటర్స్​
author img

By

Published : Jun 28, 2023, 5:40 PM IST

Nikhil siddharth spy movie : నిఖిల్​ సిద్ధార్థ్​ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్​గా తెరకెక్కిన చిత్రం 'స్పై'. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా జూన్​ 29న వరల్డ్​ వైడ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో గ్యారీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దర్శడుకు ఎడిటర్ గ్యారీ ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బోస్​కి సంబంధించి తెలియని అంశాలను చూపెట్టనున్నట్లు నిఖిల్​ తెలిపారు.

అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1605కు పైగా థియేటర్లల్లో రిలీజ్​ కానుందని సమాచారం. నైజాంలో 235కు పైగా, సీడెడ్​లో 120కు పైగా, ఆంధ్రాలో 280కు పైగా థియేటరలలో సందడి చేయనుందట ఈ చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 635కి పైగా థియేటర్స్​లో ఈ మూవీని గ్రాండ్​గా రిలీజ్​ చేయనున్నారు మేకర్స్​.దక్షిణాదిలో ఉన్న కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కలుపుకొని 550కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక విదేశాల్లో 420కి పైగా సినిమా థియేటర్ల్లలో ఈ సినిమాను రిలీజ్​ చేస్తున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1605కు పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది 'స్పై'.

spy movie pre release bussiness : ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. థియేటర్ హక్కులను రూ.18కోట్ల వరకు విక్రయించినట్టు తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18.50 కోట్లు అన్నమాట. నిఖిల్ కెరీర్​లో ఇదే అత్యధిక బ్రేక్ ఈవెన్ టార్గెట్​గా చెప్పొచ్చు. ఆంధ్రాలో రూ.6 కోట్లు, నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్​లో రూ.2 కోట్లు, ఓవర్సీస్​లో రూ.1.75 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.70 లక్షలకు విక్రయించినట్లు సినీ వర్గాల టాక్​. కాగా, కార్తీకేయ-2, 18 పేజీస్​ వంటి వరుస హిట్​లతో మంచి జోష్​ మీదున్న నిఖిల్​కు ఈ 'స్పై' సస్పెన్స్​ థ్రిల్లర్​ ఏ మేర బూస్ట్​ ఇస్తుందో మరికొద్ది గంటల్లోనే తెలియనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

నిఖిల్ 'స్పై'కి కలిసొచ్చే అంశాలెన్నో.. మరి టార్గెట్​ అందుకుంటుందా?

నిఖిల్ చేతిలో 'సెంగోల్​'.. ఈ యంగ్ హీరో టార్గెట్​ వారేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.