ETV Bharat / entertainment

'తప్పే కానీ తప్పలేదు.. మా సినిమాకు ఆ మాత్రం కావాల్సిందే'​

Nikhil Karthikeya 2: ఆసక్తి రేకెత్తించే కథాంశం.. కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఉత్కంఠ రేపే సన్నివేశాలు.. వీటన్నిటి కలబోతగా 'కార్తికేయ-2' రానుంది. హీరో నిఖిల్​ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ చిత్రానికి సీక్వెల్. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పలు విషయాలను హీరో నిఖిల్ ప్రేక్షకులతో షేర్​ చేసుకున్నారు.

hero nikhil siddharth interview
నిఖిల్‌ సిద్ధార్థ్‌
author img

By

Published : Aug 11, 2022, 11:01 PM IST

Nikhil Karthikeya 2: ఆసక్తి రేకెత్తించే కథాంశం.. కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఉత్కంఠ రేపే సన్నివేశాలు.. వీటన్నిటి కలబోతగా 'కార్తికేయ-2' రానుంది. నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్ర పోషించారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్‌హిట్‌గా నిలిచిన 'కార్తికేయ'(2014)కి ఈ చిత్రం సీక్వెల్‌. చరిత్ర, ఇతిహాసాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 13న విడుదల కానున్న 'కార్తికేయ-2' విశేషాలను యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

hero nikhil siddharth
.

కార్తికేయ-2 కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
నిఖిల్‌: 'కార్తికేయ' (2014) సూపర్‌హిట్‌ అయినప్పుడే దర్శకుడు చందూ మొండేటి దీనికి సీక్వెల్‌ ఉంటుందని నాతో అన్నారు. దాన్ని ఇంకా గ్రాండ్‌గా తీయాలని అప్పుడే చెప్పారు. మేమంతా కలిసి 2016లో శ్రీలంక వెళ్లినపుడు, అక్కడ అశోకవనాన్ని సందర్శించాం. ఆ సమయంలోనే చందూ 'కార్తికేయ-2' స్టోరీ లైన్‌ చెప్పాడు. కథ బాగా నచ్చడంతో అప్పుడే వర్క్‌ ప్రారంభించాం. మధ్యలో కొవిడ్‌ కారణంగా కొంత ఆలస్యమైంది.

సీక్వెల్‌ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు.. కొవిడ్‌ ఒక్కటే ప్రధాన కారణమా?
నిఖిల్‌: ఇది పెద్ద ప్రాజెక్ట్‌ కాబట్టి చాలా జాగ్రత్తగా తీశాం. రియల్‌ లొకేషన్లలో సన్నివేశాలను చిత్రీకరించాం. ప్రత్యేక అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూశాం. తెరపై అద్భుతాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే, మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించాం. కార్తికేయ-2 అనుకున్నది అనుకున్నట్లు తీయడానికి ఇంత సమయం పట్టింది.

మీరు తెరపై కనపడి చాలా కాలమైంది..ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందంటారు?
నిఖిల్‌: అర్జున్‌ సురవరం (2019) థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. అది సూపర్‌ హిట్‌ అయ్యింది. దాదాపు రెండున్నర సంవత్సరాల తరవాత ప్రేక్షకులకు మళ్లీ తెరపై కనిపించబోతున్నాను. ఆలస్యం అవ్వడం తప్పే కానీ తప్పలేదు. ఎందుకంటే 'కార్తికేయ-2' లాంటి సినిమా రావడానికి ఈ మాత్రం సమయం పడుతుంది.

'కార్తికేయ' సినిమాతో పోల్చుకుంటే 'కార్తికేయ-2'కి ఉన్న ప్రత్యేకతలేంటి?
నిఖిల్‌: 'కార్తికేయ'లో నేను వైద్య విద్యార్థిగా కనిపిస్తాను. 'కార్తికేయ-2'కి వచ్చేసరికి పూర్తి పరిణితి చెందిన పాత్రలో నటించాను. డాక్టర్‌ పాత్రే అయినా డిటెక్టివ్‌ కార్తీక్‌గా నన్ను ప్రేక్షకులు గుర్తిస్తారు. ఇంకా అడ్వెంచర్లు కూడా చాలా ఉంటాయి. కథాంశం కూడా కొత్తగా మరింత ఉత్కంఠ కలిగించేలా ఉంటుంది.

ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లు ‘ఇండియానా జోన్స్‌’లాంటి సినిమాలను తలపిస్తున్నాయి..ఆ జోనర్‌లోనే తీశారా?
నిఖిల్‌: మన భారతీయ చరిత్ర, ఇతిహాసాల్లో ఎన్నో అడ్వెంచర్స్‌ ఉన్నాయి. అవన్నీ రహస్యంగా ఉండిపోయాయి. వాటి గొప్పతనాన్నే ‘కార్తికేయ’లో చూపించాం. ఈసారి మరింత లోతుగా 'కార్తికేయ-2'ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నాం. భారతీయత గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రంగా కార్తికేయ-2 ఉంటుంది.

'కార్తికేయ-2' చరిత్ర కోణంలో ఉంటుందా?పురాణాల నేపథ్యంలో తీశారా?
నిఖిల్‌: ‘కార్తికేయ-2’ ట్యాగ్‌లైన్‌ హిస్టరీ వర్సెస్‌ మైథాలజీ. ఇండియన్ మైథాలజీకి సైంటిఫిక్‌ క్లారిటీ ఇచ్చాం. అదీ ప్రేక్షకుడు మెప్పు పొందేలా ఉంటుంది. 'కార్తికేయ'లో ఆ ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాం. ఈసారి మరింత విశ్లేషణతో 'కార్తికేయ-2' ద్వారా స్పష్టతనిస్తాం.

మీరు వ్యక్తిగతంగా దేవున్ని నమ్ముతారా? సైన్స్‌నా?
నిఖిల్‌: ఈ సినిమాకి ఒక కొటేషన్‌ ఉంటుంది. 'దైవం మానుష్యరూపేణా' అని. నేను వ్యక్తిగతంగా ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. దానికి సైన్స్‌ కూడా అతీతం కాదు కాబట్టి సైన్స్‌ను నమ్ముతున్నట్లే. ఆ క్లారిటీతోనే మేము కార్తికేయ-2ని రూపొందించాం.

ఈ సినిమాకు సంబంధించి మీకు బాగా నచ్చిన అంశమేంటి?
నిఖిల్‌: కథాంశం. మేము తీసుకున్న పాయింటే బలమైనది. దానికి మేం ఆధునిక హంగులు జోడించాం. విజువల్‌ ఎఫెక్ట్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా కాలభైరవ సంగీతం ఈ సినిమాకి అదనపు బలం.

హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ పాత్ర ఎలా ఉంటుంది?
నిఖిల్‌: అనుపమా పరమేశ్వరన్‌ని ఇందులో కొత్తగా చూపించాం. ఆమె నటన ఈ సినిమాకి ప్లస్‌ అవుతుంది. అనుపమ చాలా నిబద్ధత ఉన్న అమ్మాయి. షూటింగ్‌ స్పాట్‌ ఎక్కడైనా ఆమె సమయానికి అక్కడ ఉండేది.

.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ను ఈ సినిమాలోకి తీసుకోవడానికి ప్రధాన కారణమేంటి?
నిఖిల్‌: సినిమాకి ఆయన పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్ర కోసం నసీరుద్దీన్‌ షా, నానాపటేకర్‌లను కూడా సంప్రదించాలనుకున్నాం.ఈ వరుసలో ముందున్న అనుపమ్‌ ఖేర్‌ కథ విని చాలా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆయన ఒప్పుకోవడంతో టీం మొత్తం సంతోషించాం. షూటింగ్‌ సమయాల్లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక విధంగా బాలీవుడ్‌లో కూడా అటెన్షన్‌ క్రియేట్ చేయడానికి ఆయన పాత్రను కీలకంగా చిత్రించాం.

'కార్తికేయ-2' షూటింగ్‌ ఏయే ప్రాంతాల్లో చేశారు? ఆ విశేషాలేంటి?
నిఖిల్‌: నిజానికి ఉత్తరాది ప్రాంతాలని గ్రాఫిక్స్‌లో చిత్రించొచ్చు. కానీ సహజత్వం కోల్పోకూడదని మేం ఆ ప్రదేశాల్లోనే చిత్రించాం. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్.. ఇలా చాలా ప్రాంతాలని సందర్శించాం. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్ కచ్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరపడానికి అనుమతి పొంది, చాలా కష్టపడి అక్కడి సన్నివేశాలను చిత్రించాం. మా కష్టం తెరపై కనిపిస్తుంది.

ఈ సినిమాలో మీరు కష్టపడి నటించిన సన్నివేశం ఏమైనా ఉందా?
నిఖిల్‌: నాకు ఆధ్యాత్మికత విషయాలపై కొంచెం అవగాహన తక్కువ. ఈ సినిమాలో ఒక సీన్‌లో భగవంతుడి తత్వాన్ని తెలిపే డైలాగ్‌ను చెప్తూ, ఆ హావభావాలను పలికించడం కొంచెం కొత్తగా అనిపించింది.

కార్తికేయ-2 సినిమాని హిందీలోనూ విడుదల చేయడానికి గల కారణం ఏంటి?

నిఖిల్‌: కథకు ఉన్న బలమే. 'కార్తికేయ-2' చెప్పే అంశానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఆసక్తి ఉంది. అందుకే హిందీలోనూ విడుదల చేస్తున్నాము. సినిమాలో చాలా అంశాలు అక్కడి ప్రాంతాలకు కనెక్ట్‌ అయ్యి ఉన్నాయి. అది కూడా కారణం.

మీ తదుపరి చిత్రాల వివరాలేంటి? పాన్‌ ఇండియా చిత్రాలపై మీ అభిప్రాయమేంటి?
నిఖిల్‌: గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో '18 పేజెస్‌' చిత్రం వస్తుంది. అది తెలుగులోనే విడుదలవుతుంది. దాని తరువాత రానున్న చిత్రం 'స్పై' అన్ని భాషల్లో విడుదలవనుంది. ఇంకా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. పాన్‌ ఇండియా సినిమాల విషయానికొస్తే కథ చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లాంటి కొందరు హీరోలకు ఉండే క్రేజ్‌ని బట్టి కూడా సినిమాకి పాన్‌ ఇండియా స్థాయి వస్తుంది. ఇక నా విషయానికొస్తే నా సినిమా 'స్పై' పాన్‌ ఇండియా లాంగ్వేజెస్‌లో విడుదల అవుతుంది.

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే అంశంపై మీరేమంటారు?
నిఖిల్‌: ఇంతకుముందు పరిస్థితితో పోల్చుకుంటే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. కానీ కంటెంట్‌ ఉన్న సినిమాని థియేటర్లలో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడతారు. కచ్చితంగా థియేటర్లలో అటువంటి సినిమాలకు ఆదరణ ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: కొత్త గర్ల్​ఫ్రెండ్​తో టైగర్ ​ష్రాఫ్ షికార్లు.. దిశాపటానీ కన్నా హాట్​గా ఉందిగా!

నేను పోషించిన ఆ పాత్ర చూసి పెళ్లి కాదన్నారు: ఎమ్​సీఏ విలన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.