ETV Bharat / entertainment

రియల్ శ్రీమంతుడ్ని కలిసిన మహేశ్​.. కొత్త సినిమా కోసం క్రేజీ ఐడియా! - మహేశ్​బాబు బిల్​గేట్స్​ ట్వీట్​

అమెరికాలో ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నారు హీరో మహేశ్​బాబు. తాజాగా ఆయ‌న పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్స్‌ను ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ‌హేశ్​ పోస్ట్ చేసిన పిక్ ఏంటో తెలుసా? ప్రపంచ కుబేరుడు బిల్స్​గేట్స్‌తో మ‌హేశ్​, న‌మ్ర‌త దిగిన ఫొటో. దీనిని చూసిన అభిమానులు.. కొత్త సినిమా విషయంలో మహేశ్​కు క్రేజీ ఐడియాలు ఇస్తున్నారు.

mahesh bill gates
mahesh bill gates
author img

By

Published : Jun 29, 2022, 1:05 PM IST

Mahesh Billgates: ప్రపంచ శ్రీమంతుల్లో బిజినెస్ టైకూన్ బిల్​గేట్స్ ఒక‌రు. ఆయ‌న‌కు మ‌న దేశంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఈ ప్ర‌పంచ శ్రీమంతుడిని మన వెండితెర శ్రీమంతుడు మహేశ్​బాబు క‌లిశారు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. ఆ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు.

mahesh bill gates
బిల్​గేట్స్​తో మహేశ్​, నమ్రత

ప్ర‌స్తుతం మ‌హేశ్​.. ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పలు ప‌ర్యట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఫ్యామిలీతో ఉన్న ఫొటోల‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ న‌గరంలో బిల్​గేట్స్‌ను మ‌హేశ్​ క‌లుసుకున్నారు. ఆ ఫొటో షేర్ చేస్తూ.. "నిజంగా బిల్‌గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. అంతేకంటే ఎంతో వినమ్రతతో ఉంటారు. నిజంగా అందరికీ ఆయనో స్ఫూర్తి!!" అని మహేశ్ బాబు తన ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

mahesh bill gates
హీరో మహేశ్​ ట్వీట్​

ఆ ఫొటోను చూసిన మహేశ్​ అభిమానులు.. క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. 'అన్నా బిజినెస్‌మేన్ 2' తీయ‌మ‌ని కొంద‌రు స‌ల‌హా ఇస్తుంటే.. మ‌రికొందరు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే .. ఈ ఏడాది 'స‌ర్కారు వారి పాట' చిత్రంతో స‌క్సెస్ అందుకున్న మ‌హేశ్​.. త‌దుప‌రి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దర్శకుడు రాజ‌మౌళి కూడా మ‌హేశ్​ కోసం క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి: మరోసారి తండ్రైన దిల్​రాజు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని

'ఈ సినిమాలో ఇప్పటివరకు ఎక్కడా చూడని సన్నివేశాలుంటాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.