ETV Bharat / entertainment

హీరో కార్తీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌.. ఏం జరిగింది? - హీరో కార్తీ సినిమాలు

సెలబ్రిటీల సోషల్​మీడియా ఖాతాలు హ్యాక్​ అవ్వడం తరచుగా వింటున్నాం. తాజాగా హీరో కార్తీ ఫేస్​బుక్​ పేజీ హ్యాక్​ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ ద్వారా తెలియజేశారు.

Karthi Facebook Account Hacked
Karthi Facebook Account Hacked
author img

By

Published : Nov 14, 2022, 3:20 PM IST

Karthi Facebook Account Hacked: భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు కార్తీ. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లైనా.. తన వ్యక్తిగత విషయాలైనా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు ఈ యంగ్‌ హీరో. తరచూ నెట్టింట యాక్టివ్‌గా ఉండే కార్తీ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయిందట. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ వేదికగా తెలియజేశారు.

"నా ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ టెక్నికల్‌ టీంతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలోనే అకౌంట్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం" అని ట్వీట్‌ చేశారు.

Karthi Facebook Account Hacked
కార్తీ ట్వీట్​

ఇక ఈ ఏడాది కార్తీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాతో అలరించిన ఈ హీరో సర్దార్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో కార్తీ నటనకు సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ హీరో రాజు మురుగన్‌ దర్శకత్వంలో జపాన్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ అలరించనున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.