ETV Bharat / entertainment

కమల్ హాసన్​తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్​.. 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో - కమల్​ హాసన్​ సినిమాలు

ఇప్పటివరకు 233 సినిమాలు చేసిన స్టార్ హీరో కమల్​ హాసన్.. ఆదివారం తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం​తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. దాదాపు 35 ఏళ్ల తరువాత వీరి కాంబినేషన్​లో సినిమా రాబోతుంది.

hero kamal hasan new movie with maniratnam

author img

By

Published : Nov 6, 2022, 8:33 PM IST

Kamal Hasan New Movie: యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తన కెరీర్​లో రెండొందలకు పైగా సినిమాలు చేశారు. ఇటీవల ఆయన నటించిన 'విక్రమ్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమల్ వరుస సినిమాలను లైన్​లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్ 2' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇంతలో మరో సినిమాను ఒప్పుకున్నారు.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు కమల్ హాసన్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. వీరిద్దరూ కలిసి ఇదివరకు 'నాయకన్' అనే సినిమాను తీశారు. 1987లో ఈ సినిమా రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు.

దాదాపు 35 ఏళ్ల తరువాత మరోసారి వీరి కాంబినేషన్​లో సినిమా రాబోతుంది. దీనికి ఏఆర్ రెహమాన్​ సంగీతం అందించనున్నారు. మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కమల్ హాసన్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. కమల్ హాసన్ 234వ సినిమా ఇది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.